Teluguvaramandi.net
Home
AboutMe
Contact
Language State Politics Culture Sciences Entertainment Bhakti Literature Arts Cinema

Gruhanirmanam (House Construction)

1. The builder of the house should start from Niruti and following the suggestions of Vastu level the land and lay foundation.
2. Validate the strength of the land and based on that we should lay the foundation.

3. The door frame should be established within one year.

4. During the construction of the house the walls should be level.

5. The flow should start from the inner house to the outer else the residents may experience toubles in future.

6. As soon as the slab is laid the house should be lit with a lamp and walls and doors should be fixed.

7. The house should not be attached to the compound wall in any direction. In case it cannot be avoided try to avoid east and north directions. East of Esanyam and North of Esanyam must always be left open.

8. విశాలమైన స్థలము గల గృహస్తుడు ఏకాశీతిపద వాస్తు సూత్ర ప్రకారము ప్రహారీలు ముఖ ద్వారములు నిర్మించి గృహనిర్మాణము చేసిన సర్వ శుభములు కలుగును.

9. తూర్పు ఉత్తర గోడలు పడమర దక్షిణ గోడల కన్న ఎత్తుగా నిర్మించకూడదు.

10. తూర్పు ఉత్తర వసారాలు తెరిసి ఉంచ వలెను. మూసి వేయరాదు. అట్లు చేసిన కీర్తి నాశనము గల్గును.

11. రెండు గర్భములతో ఒక గృహము నిర్మించరాదు. దారిద్ర్యము, గర్భస్రావములు కల్గును.

12. మూదు గర్భములలో ఒకటిగాని, ఓక దాని ప్రక్క మరొకటిగాని, అట్లే 3 వెన్నులు వచ్చునట్లు గృహనిర్మాణము చేయకూడదు. దారిద్ర్యము మరణభయము కలుగును.

13. ద్వారములు కిటికీలు అలమరలు అమర్చునప్పుడు గోడ మధ్య నుండి వెలుపులకు అమర్చి తలుపులు గది గర్భము లోనికి వచ్చునట్లు ఏర్పాటు చేసుకొనవలెను.

14. సినీమాహాలు స్కూలు భవనములకు ఆఫీసులు, గోదాములకు ఈ సూత్రము పాటించనక్కరలేదు.

15. వీధిని బట్టి ముఖ ద్వారము నిర్ణయించవలెను. స్థలమును బట్టి గాని, నామనక్షత్రములను బట్టిగాని ముఖద్వార స్థాపన శాస్త్ర సమ్మతము కాదు.

16. దొడ్డి ద్వారము వీధివైపు, ముఖద్వారము నిర్ణయించకూడదు.

17. దిక్కులందు - పార్శభాగములందు ద్వారములు అమర్చరాదు - అయశ్వర్యహాని కలుగును.

18. తలుపులు వేయునప్పుడు తీయునప్పుదు శబ్ధమురాకూడదు.

19. ద్వారము ముందుకు గాని వెనుకకు గాని వంగియుండరాదు. నిటారుగా ఉండవలెను.

20. ద్వారమునకు ద్వారము గాని, లేక కిటికీ గాని, తప్పనిసరిగా జవాబుగా ఉండవలెను. వీలుగాని చోట అలమరలు జవాబుగా ఉండవలెను. వీలుగాని చోట అలమరలు జబాబుగా ఉండవచ్చును.

21. డాబా ఇండ్లకు వీలైనన్నీ కిటికీలు ఏర్పాటు చేసుకోవచ్చును.

22. స్థంభములు, దూలములు, వాసములు సరిసంఖ్య గాను, ఆర్చీలు (అళిందములు) జేసి సంఖ్యగాను ఏర్పాటు చేయవలెను 3 పంచలతో గృహ నిర్మాణము చేయరాదు.

23. ద్వారముల క్రింద మీద మట్టములు సమానముగా ఉండవలెను.

24. ముఖద్వారము అన్ని ద్వారముల కన్న కొంచెం ఎత్తుగాను వెడెల్పుగాను ఉండవలెను.

25. ద్వారము ఉల్లోపు కొలతలు 5:3 లేక వెడల్పు కన్న ఎత్తు రెండింతలకు పైగా ఉండవలెను. అంతకు తక్కువగా ఉండరాదు. 64X32 లేక 69X33 అంగుళములు ఉల్లోపు గల ద్వారములు శుభము. గృహము యొక్క ఎత్తు ఉల్లోపులను బట్టి ద్వారా ప్రమాణము పెంచవలెను.

26. గృహ గర్భము సెంటరునకు ముఖ ద్వారము యొక్క సెంటర్ కలియరాదు.

27. ముఖ ద్వారమును రెండు వైపులు కిటికీలు అమర్చుటపై (28) సూత్ర్పకారము సర్వశుభములు చేకూరును.

28. ముఖద్వార స్థాపన వాస్తు పురుషుని శయనగతి ననుసరించి మంచి ముహూర్తమున దృష్టి సారించు దిక్కునకు లేదా పాదములుండు దిక్కునకు ఎదురుగా వెళ్ళి చేయవలెను.

29. గుమ్మములు సరిసంఖ్యలో ఉండవలెను. బేసి సంఖ్య, సున్న రాకూడదు. ప్రధాన గృహమునకు ముందు సంఖ్య సరిచేసి తదుపరి ఉపగృహములకు గేట్లతో సహ జతచేసినప్పుడు పై సంఖ్య సూత్రము పాటించవలెను.

30. కిటికీలు, అలమరల విషయంలో గూడ ఈ సూత్రము పాటించుట మంచిది.

31. ద్వారమునకు ఒకతలుపుగాని, రెండు తలుపులు గాని వేయవచ్చును. తలుపులకు వేయుపలకలు బేసిసంఖ్యలో ఉండవలెను.

32. ద్వారములకు తలుపులకు ఏకజాతికర్ర వాడవలెను.

33. పై అంతస్థు నిర్మాణములో ద్వారము వైపు కిటికి గాని ద్వారము గాని నిర్మించవచ్చును.

34. తలుపులు అమర్చుటలో కాళీలు సందులు వంపులు తిరిగి యుండరాదు.

35. నూతన గృహాలకు పాతయిండ్ల సామాగ్రి (గృహశల్యములు) వాడకూడదు. తన స్వగృహం యొక్క సామాగ్రి అయినచో ఉపగృహములకు వాడవచ్చును.

36. టేకు, గుగ్గులము, గనము, అనెప, ఏగిశ, వేప కంబ, నల్లమద్రి మొదలగు కర్ర గృహనిర్మాణమునకు మంచిది.

back Back
All rights Reserved