|
|
|
చిన్న పిల్లలు తమ అమ్మ వడిలో నేర్చుకొనే మొట్టమొదటి పాఠాలు లాలి పాటలుగా చిట్తి పొట్టి పద్యాలుగా మొదలవుతాయి. అమ్మ తన చిన్ని కృష్ణుని చూచి తాతంగ తారంగం అని పాడినప్పుదు ఆ కన్నులలోని ఆనందం చూడవచ్చు.
పెరిగి పెద్దైన పిల్లలు ఆడుతూ పాడుతూ పాడుకొనే గదిపే చిన్నతనంలో ఎన్నొ పాటలు గురుతుతెచ్చుకొందాం.
Children learn their first lessons in their mother's lap in the form of 'laali paatalu' (rhymes), and short poems.
As we grow-up we spent singing these rhymes, so lets remember some.
|
అ ఆ
|
|
అదిగో నండీ మాబడి
నేర్పును మాకు చక్కని నడవడి
శ్రద్ధగ చదువులు చదివెదమండి
చక్కగ కలిసి ఉంటామండి
పాఠాలెన్నో చదివామండీ
పంచ తంత్రం విన్నామండీ
అందులో నీతి తెలిసిందండీ
ఎప్పుడు తప్పులు చేయంలేండి!
చక్కగ బుద్దుగ ఉంటామండీ
మంచి పనులు చేస్తామండీ
కలసి అందరం ఉంటామండీ
ఆనందంగా జీవిస్తామండీ
తగువులుఎప్పుడు పడమింకండి
కలసి కట్టుగా ఉంటామండీ
కలసి మెలిసి పని చేస్తామండీ
కంచు కోట నిర్మిస్తామండీ
కోటకు జెండా కడ్తామండీ
ఆకాశాన ఎగరేస్తామండీ
ఆ ఎగరే జెండా మాదే నండీ
అది మా భారత జెండా సుమండీ!
|
adigoa namDee maabaDi
naerpunu maaku chakkani naDavaDi
Sraddhaga chaduvulu chadivedamamDi
chakkaga kalisi umTaamamDi
paaThaalennoa chadivaamamDii
pamcha tamtram vinnaamamDii
amduloa neeti telisimdamDii
eppuDu tappulu chaeyamlaemDi!
chakkaga budduga umTaamamDee
mamchi panulu chaestaamamDee
kalasi amdaram unTaamamDee
aanamdamgaa jeevistaamamDee
taguvulueppuDu paDamimkamDi
kalasi kaTTugaa umTaamamDee
kalasi melisi pani chaestaamamDee
kamchu koaTa nirmistaamamDee
koaTaku jemDaa kaDtaamamDee
aakaaSaana egaraestaamamDee
aa egarae jemDaa maadae namDee
adi maa bhaarata jemDaa sumamDee!
|
అల్లరి రాజా
అల్లరి రాజా వచ్చాడు
పిల్లల్లందర్ని పిలిచాడు
అల్లరి ఎంతో చేశాడు
ఘొడవలు ఎన్నో తెచ్హదు
నాన్నతో తన్నులు తిన్నడు
అల్లరి అంతా మానాడు
పుస్తకం చేత పట్టాడు
శ్రద్దగా నాన్నతో వెళ్లాడు
గురువు వద్ద జేరాడు
చదువులు బాగా చదివాడు
పాఠాలెన్నో నేర్చాదు
పెద్దల మన్నన పొందాడు
|
allari raajaa
allari raajaa vacchaaDu
pillallamdarni pilichaaDu
allari emtoa chaeSaaDu
GoDavalu ennoa techhadu
naannatoa tannulu tinnaDu
allari amtaa maanaaDu
pustakam chaeta paTTaaDu
Sraddagaa naannatoa veLlaaDu
guruvu vadda jaeraaDu
chaduvulu baagaa chadivaaDu
paaThaalennoa naerchaadu
peddala mannana pomdaaDu
|
తెలుపు గేయం
అమ్మ మాట తెలుపు - ఆవు పాలు తెలుపు
మల్లె పూలు తెలుపు - మంచి మాట తెలుపు
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు
పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు
గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు
జాజి పూలు తెలుపు - జాబిల్లి తెలుపు
జాలి గుండె తెలుపు - చల్లని మంచు తెలుపు
వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు
మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు
|
telupu gaeyam
amma maaTa telupu - aavu paalu telupu
malle poolu telupu - mamchi maaTa telupu
chamdamaama telupu - sannajaaji telupu
mamchi manasu telupu - paavuraayi telupu
pamchadaara telupu - paalu perugu telupu
guruvugaari chokkaa telupu - goavimda naamamu telupu
jaaji poolu telupu - jaabilli telupu
jaali gumDe telupu - challani mamchu telupu
vennelamma telupu - vaepa puvvu telupu
mamchi mutyam telupu - paapaayi navvu telupu
|
ఆదివారము నాడు అరటి మొలచింది
సోమవారము నాడు సుది వేసి పెరిగింది
మంగళవారము నాడు మారాకు తొడిగింది
బుధవారము నాడు పొట్టి గెల వేసింది
గురువారము నాదు గుబురులో దాగింది
శుక్రవారము నాడు చూడగా పండింది
శనివారము నాడు చకచకా గెల కోసి
అందరికీ పంచి ఇత్తుము అరటి అత్తములు
అబ్బాయీ అమ్మాయీ అరటి పండ్లివిగో
|
aadivaaramu naaDu araTi molachimdi
soamavaaramu naaDu sudi vaesi perigimdi
mamgaLavaaramu naaDu maaraaku toDigimdi
budhavaaramu naaDu poTTi gela vaesimdi
guruvaaramu naadu guburuloa daagimdi
Sukravaaramu naaDu chuuDagaa pamDimdi
Sanivaaramu naaDu chakachakaa gela koasi
amdarikii pamchi ittumu araTi attamulu
abbaayii ammaayii araTi pamDlivigoa
|
ఆదివారం పుట్టిన బాలుడు - అద్భుతంగా చదువుతాడు.
సోమవారం పుట్టిన బాలుడు - సత్యమునే పలుకుతారు.
మంగళవారం పుట్టిన బాలుడు - మంచి పనులు చేస్తాడు.
బుధవారం పుట్టిన బాలుడు - బుద్ధిమంతుడై ఉంటాడు.
గురువారం పుట్టిన బాలుడు - పరోపకారం చేస్తాడు
శుక్రవారం పుట్టిన బాలుడు - సహనం కలిగి ఉంటాడు
శనివారం పుట్టిన బాలుడు - శాంతంగా ఉంటాడు
|
Adivaaram puTTina baaluDu - adbhutamgaa chaduvutaaDu.
soamavaaram puTTina baaluDu - satyamunae palukutaaru.
mamgaLavaaram puTTina baaluDu - mamchi panulu chaestaaDu.
budhavaaram puTTina baaluDu - buddhimamtuDai umTaaDu.
guruvaaram puTTina baaluDu - paroapakaaram chaestaaDu
Sukravaaram puTTina baaluDu - sahanam kaligi umTaaDu
Sanivaaram puTTina baaluDu - Saamtamgaa umTaaDu
|
ఆటలంటే మాకిష్టం - పాటలంతే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మా కిష్టం
సినిమాలంటే మా కిష్టం - మిఠాయిలంటే మా కిష్టం
సినిమాలకన్నా మిఠాయిలకన్నా- షికార్లు అంటే మా కిష్టం
పిట్టలంటే మా కిష్టం - పువ్వులంటే మా కిష్టం
పిట్టల కమ్న్నా పువ్వులకన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం
కొత్త బట్టలు మా కిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం
బట్టల కన్నా పౌడరు కన్నా - మట్టిలో ఆటలు మాకిష్టం
టీచర్లంటే మా కిష్టం - పాఠాలంటే మాకిష్టం
టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం
వెన్నెలంటే మా కిష్టం - వానలంటే మాకిష్టం
వెన్నెల కన్నా వానలకన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం
|
aaTalamTae maakishTam - paaTalamtae maakishTam
aaTala kannaa paaTala kannaa - allari panulae maa kishTam
sinimaalamTae maa kishTam - miThaayilamTae maa kishTam
sinimaalakannaa miThaayilakannaa - shikaarlu amTae maa kishTam
piTTalamTae maa kishTam - puvvulamTae maa kishTam
piTTala kamnnaa puvvulakannaa - cheTlu ekkaDam maakishTam
kotta baTTalu maa kishTam - pouDaru snoalu maakishTam
baTTala kannaa pouDaru kannaa - maTTiloa aaTalu maakishTam
TiicharlamTae maa kishTam - paaThaalamTae maakishTam
Tiicharu kannaa paaTham kannaa - baDi selavamTae maakishTam
vennelamTae maa kishTam - vaanalamTae maakishTam
vennela kannaa vaanalakannaa - amma muddulae maakishTam
|
ఆకేసి - ఉప్పేసి
పప్పేసి - అన్నం పెట్టి
చారేసి - నెయ్యివోసి
అమ్మకొక ముద్ద నాన్నకొక ముద్ద
చెల్లికొక ముద్ద అక్కకొక ముద్ద
అవ్వకొక ముద్ద తాతకొక ముద్ద
అందరికి పెట్టి నువ్వు తిని
నేనూ తిని ఆకేతైసి
[ఆకేసి వక్కెత్తెసి
సంతకు పోయే దారేది
అత్తారింటికి దారేది]
|
aakaesi - uppaesi
pappaesi - annam peTTi
chaaraesi - neyyivoasi
ammakoka mudda naannakoka mudda
chellikoka mudda akkakoka mudda
avvakoka mudda taatakoka mudda
amdariki peTTi nuvvu tini
naenuu tini aakaetaisi
[aakaesi vakkettesi
samtaku poayae daaraedi
attaarimTiki daaraedi]
|
తెలుపు గేయం
అమ్మ మాట తెలుపు - ఆవు పాలు తెలుపు
మల్లె పూలు తెలుపు - మంచి మాట తెలుపు
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మంచి మనసు తెలుపు - పావురాయి తెలుపు
పంచదార తెలుపు - పాలు పెరుగు తెలుపు
గురువుగారి చొక్కా తెలుపు - గోవింద నామము తెలుపు
జాజి పూలు తెలుపు - జాబిల్లి తెలుపు
జాలి గుండె తెలుపు - చల్లని మంచు తెలుపు
వెన్నెలమ్మ తెలుపు - వేప పువ్వు తెలుపు
మంచి ముత్యం తెలుపు - పాపాయి నవ్వు తెలుపు
|
telupu gaeyam
amma maaTa telupu - aavu paalu telupu
malle poolu telupu - mamchi maaTa telupu
chamdamaama telupu - sannajaaji telupu
mamchi manasu telupu - paavuraayi telupu
pamchadaara telupu - paalu perugu telupu
guruvugaari chokkaa telupu - goavimda naamamu telupu
jaaji poolu telupu - jaabilli telupu
jaali gumDe telupu - challani mamchu telupu
vennelamma telupu - vaepa puvvu telupu
mamchi mutyam telupu - paapaayi navvu telupu
|
|
|
ఉ ఊ
|
|
ఊగు ఊగు గంగిరెద్దా - ఉగ్గుపాలె గంగిరెద్దా
సోలి ఊగె గంగిరెద్దా - సోలెడు పాలె గంగిరెద్దా
తాళీ ఊగే గంగిరెద్దా - తవ్వెడు పాలె గంగిరెద్దా
మారీ ఊగే గంగిరెద్దా - మానెడు పాలె గంగిరెద్దా
ఆగీ ఊగే గంగిరెద్దా - అడ్డపాలె గంగిరెద్దా
|
uugu uugu gamgireddaa - uggupaale gamgireddaa
soali uuge gamgireddaa - soaleDu paale gamgireddaa
taaLii uugae gamgireddaa - tavveDu paale gamgireddaa
maarii uugae gamgireddaa - maaneDu paale gamgireddaa
aagii uugae gamgireddaa - aDDapaale gamgireddaa
|
ఊగాడమ్మ ఊగాడు - ఊగే చిలకా ఊగాడు
బంగారు బొమ్మ ఊగాడు - తంగెడు పువ్వా ఊగాడు
కులదీపంబా ఊగాదు - గుడిపావురమా ఊగాడు
కన్నుల వెలుగా ఊగాడు - సొగసులగువ్వా ఊగాడు
శుకమాసికమా ఊగాడు - చక్కని నెమలీ ఊగాడు
చక్కెరబొమ్మా ఊగాడు - ముద్దులగుమ్మా ఊగాడు
|
uugaaDamma uugaaDu - uugae chilakaa uugaaDu
bamgaaru bomma uugaaDu - tamgeDu puvvaa uugaaDu
kuladeepambaa uugaadu - guDipaavuramaa uugaaDu
kannula velugaa uugaaDu - sogasulaguvvaa uugaaDu
Sukamaasikamaa uugaaDu - chakkani nemalii uugaaDu
chakkerabommaa uugaaDu - muddulagummaa uugaaDu
|
|
|
ఎ ఏ ఐ
|
|
ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా.
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా.
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండే టందుకురా.
చెరువులు నిండేదెదుంకురా?
పంటలు పండే టందుకురా
పంటలు పండేదెందుకురా?
ప్రజలు బ్రతికే టందుకురా.
ప్రజలు బ్రతికే దెందుకురా?
దేవుని కొలిచే టందుకురా
దేవుని కొలిచే దెందుకురా?
ముక్తిని పొందే టందుకురా.
|
emDalu kaasaedemdukuraa?
mabbulu paTTaeTamdukuraa.
mabbulu paTTaedemdukuraa?
vaanalu kurisaeTamdukuraa.
vaanalu kurisaedemdukuraa?
cheruvulu nimDae Tamdukuraa.
cheruvulu nimDaededumkuraa?
pamTalu pamDae Tamdukuraa
pamTalu pamDaedemdukuraa?
prajalu bratikae Tamdukuraa.
prajalu bratikae demdukuraa?
daevuni kolichae Tamdukuraa
daevuni kolichae demdukuraa?
muktini pomdae Tamdukuraa.
|
ఎంతో మంది పనివాళ్ళు - ఎంతో మంచి పనివాళ్ళు
మడకను దున్నే మాదన్నా - కొడవలి పట్టిన కొండమ్మా
గుడ్డలు నేసే గురవయ్యా - బట్టలు ఉతికే బాలమ్మ
!!ఎంతోమంది!!
కుండలు చేసే కుమరయ్యా - కొలిమని ఊదే కోనయ్యా
చెప్పులు కుట్టే చెన్నయ్యా - దుస్తులు కుట్టే మస్తాను
చదువు నేర్పే సాంబయ్యా - యంత్రం నడిపే ఏసయ్యా
పనివాళ్ళంతా సమానమే - అని చెప్పేదే సమాజము
|
emtoa mamdi panivaaLLu - emtoa mamchi panivaaLLu
maDakanu dunnae maadannaa - koDavali paTTina komDammaa
guDDalu naesae guravayyaa - baTTalu utikae baalamma
!!emtoamamdi!!
kumDalu chaesae kumarayyaa - kolimani uudae koanayyaa
cheppulu kuTTae chennayyaa - dustulu kuTTae mastaanu
chaduvu naerpae saambayyaa - yamtram naDipae aesayyaa
panivaaLLamtaa samaanamae - ani cheppaedae samaajamu
|
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు
నాలుగు కాళ్ళ ఏనుగు - చిన్న తోక ఏనుగు
చేట చెవుల ఏనుగు - చిన్ని కళ్ళ ఏనుగు
తెల్ల దంతపు ఏనుగు - పొడవు తొండం ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్ద ఏనుగు
|
aenugamma aenugu - emtoa pedda aenugu
naalugu kaaLLa aenugu - chinna toaka aenugu
chaeTa chevula aenugu - chinni kaLLa aenugu
tella damtapu aenugu - poDavu tomDam aenugu
aenugamma aenugu - emtoa pedda aenugu
|
ఏనుగమ్మ ఏనుగు - ఏ ఊరొచ్చిందేనుగు
మావూరొచ్చిందేనుగు - మంచినీళ్ళే తాగిందేనుగు
ఉప్పునీళ్ళు తాగిందేనుగు - ఊరెళ్ళ గెట్టిందేనుగు
|
aenugamma aenugu - ae uurocchimdaenugu
maavuurocchimdaenugu - mamchiniiLLae taagimdaenugu
uppuniiLLu taagimdaenugu - uureLLa geTTimdaenugu
|
ఏనుగు ఏనుగు నల్లన
ఏనుగు కొమ్ములు తెల్లన
ఏనుగు మీద రాముడు
ఎంతో మంచి దేవుదు
|
aenugu aenugu nallana
aenugu kommulu tellana
aenugu meeda raamuDu
emtoa mamchi daevudu
|
|
|
ఒ ఓ
|
|
ఒకటి ఒకటి రెండు - వేళకు బడికి రండు
రెండు ఒకటి మూడు - ఒకరికి ఒకరు తోడు
మూడు ఒకటి నాలుగు - కలిసి మెలసి మెలగు
నాలుగు ఒకటి ఐదు - చెడ్డ వారికి ఖైదు
ఐదు ఒకటి ఆరు - న్యాయం కోసం పోరు
ఆరు ఒకటి ఏడు - అందరి మేలు చూడు
ఏడు ఒకటి ఎనిమిది - భారత దేశం మనది
ఎనిమిది ఒకటి తొమ్మిది - కమ్మని మనసు అమ్మది
తొమ్మిది ఒకటి పది - చదువే మనకు పెన్నిది
|
okaTi okaTi remDu - vaeLaku baDiki ramDu
remDu okaTi muuDu - okariki okaru toaDu
muuDu okaTi naalugu - kalisi melasi melagu
naalugu okaTi aidu - cheDDa vaariki Kaidu
aidu okaTi aaru - nyaayam koasam poaru
aaru okaTi aeDu - amdari maelu chuuDu
aeDu okaTi enimidi - bhaarata daeSam manadi
enimidi okaTi tommidi - kammani manasu ammadi
tommidi okaTi padi - chaduvae manaku pennidi
|
ఒక్కతి ఓ చలియా, రెండూ రోకళ్లు;
మూదు ముచ్చిలకా, నాలుగు నందన్నా;
అయుదుం బేడల్లు, ఆరుంజవ్వాజి;
ఏడూ యెలమంద, ఎనిమిది మనమంద;
తొమ్మిది తోకుచ్చు.
|
okkati oa chaliyaa, remDuu roakaLlu;
muudu mucchilakaa, naalugu namdannaa;
ayudum baeDallu, aarumjavvaaji;
aeDuu yelamamda, enimidi manamamda;
tommidi toakucchu.
|
ఒప్పుల కుప్పా ఒయ్యారి భామా
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూ లాడి
నడుమూ గట్టె నామాటె చిట్టీ
దూదూపుల్ల దురాయ్ పుల్ల
చూడాకుండాజాడా తీయ్
ఊదకుండా పుల్లా తీయ్
దాగుడు మూత దండాకోర్
పిల్లీ వచ్చె ఎలుకా భద్రం
ఎక్కడి దొంగాలక్కణ్ణే గప్ చిప్
|
oppula kuppaa oyyaari bhaamaa
minapaa pappu memtee pimDi
taaTii bellam tavveDu naeyi
guppeDu timTae kulukuu laaDi
naDumuu gaTTe naamaaTe chiTTee
duuduupulla duraay pulla
chuuDaakumDaajaaDaa teey
uudakumDaa pullaa tiiy
daaguDu muuta damDaakoar
pillee vacche elukaa bhadram
ekkaDi domgaalakkaNNae gap chip
|
ఓరోరి వెంకన్న - మెట్లపల్లి వెంకన్న
ఎద్దును తెమ్మంటే - ఎలుకను తెచ్చె
కాల్చుకు రమ్మంటే - మాడ్చుకు వచ్చె
పై చూడమంటే - సగం మింగి తెంచె
ఆగాగు మంటే - అయింతా తినె
ఓరోరి వెంకన్న తిండిపోతు వెంకన్న
|
oaroari vemkanna - meTlapalli vemkanna
eddunu temmamTae - elukanu tecche
kaalchuku rammamTae - maaDchuku vacche
pai chuuDamamTae - sagam mimgi tenche
aagaagu mamTae - ayimtaa tine
oaroari vemkanna timDipoatu vemkanna
|
ఓ బొజ్జ గణపయ్య - నీ బంటు నేనయ్య
కమ్మని నెయ్యయ్య - కందిపప్పయ్య
పేరిన నెయ్యయ్య - పెసర పప్పయ్య
ఎలుక వాహనమదీ - ఎక్కిరావయ్య
ఉండ్రాళ్ళ మీదకి - దండు బోవయ్య
|
oa bojja gaNapayya - nii bamTu naenayya
kammani neyyayya - kamdipappayya
paerina neyyayya - pesara pappayya
eluka vaahanamadii - ekkiraavayya
umDraaLLa miidaki - damDu boavayya
|
|
|
క ఖ
|
|
కుదురుగ పాపడు గుమ్మడి కాయ
విరిసిన పాపడు విఘ్నేశాయ
సాగిన పాపడు శాంబశివాయ
చెలగిన పాపదు శ్రీ కృష్ణాయ
అందెల పాపడు ఆంజనేయాయ
చెంగటి పాపడు శ్రీలోలాయ
జోలిన పాపడు జోసూర్యాయ
సందిట పాపడు సహచంద్రాయ
తారుచు పాపడు తాతారాయ
బొజ్జన్న పాపడు పూర్ణబ్రహ్మాయ
ఆడిన పాపడు ఆనందాయ
|
kuduruga paapaDu gummaDi kaaya
virisina paapaDu viGnaeSaaya
saagina paapaDu SaambaSivaaya
chelagina paapadu Sree kRshNaaya
amdela paapaDu aamjanaeyaaya
chemgaTi paapaDu Sreeloalaaya
joalina paapaDu joasuuryaaya
samdiTa paapaDu sahachamdraaya
taaruchu paapaDu taataaraaya
bojjanna paapaDu poorNabrahmaaya
ADina paapaDu aanamdaaya
|
కాకి కాకి గువ్వల కాకి - కాకి నాకు ఈకా ఇచ్చే
ఈకా తెచ్చీ దిబ్బకు ఇస్తే - దిబ్బా నాకూ ఎరువూ ఇచ్చె
ఎరువూ తెచ్చీ చేలో వేస్తే - చేను నాకు గడ్డీ ఇచ్చే
గడ్డీ తెచ్చీ ఆవుకు ఇస్తే - ఆవూనాకూ పాలు ఇచ్చే
పాలు తెచ్చి పంతులు కిస్తే - పంతులు నాకూ పాఠం చెప్పే
|
kaaki kaaki guvvala kaaki - kaaki naaku eekaa icchae
eekaa tecchii dibbaku istae - dibbaa naakuu eruvuu icche
eruvuu tecchii chaeloa vaestae - chaenu naaku gaDDii icchae
gaDDii tecchii aavuku istae - aavuunaakuu paalu icchae
paalu tecchi pamtulu kistae - pamtulu naakuu paaTham cheppae
|
కొండాపల్లి కొయ్యా బొమ్మా
నీకో బొమ్మా, నాకో బొమ్మా.
నక్కాపల్లీ లక్కా పిడతలు
నీకో పిడత నాకో పిడత
నిర్మల పట్నం బొమ్మల పలకలు
నీకో పలకా నాకో పలకా.
బంగిన పల్లీ మామిడి పండ్లూ
నీకో పండూ, నాకో పండూ
ఇస్తానుండూ తెచ్చేదాకా
చూస్తూవుండూ ఇచ్చేదాకా.
|
komDaapalli koyyaa bommaa
neekoa bommaa, naakoa bommaa.
nakkaapallii lakkaa piDatalu
niikoa piData naakoa piData
nirmala paTnam bommala palakalu
neekoa palakaa naakoa palakaa.
bamgina pallii maamiDi pamDluu
neekoa pamDuu, naakoa pamDuu
istaanumDuu tecchaedaakaa
chuustuuvumDuu icchaedaakaa.
|
|
|
గ ఘ
|
గంధం మెడకు పూసుకొని - పసుపూ కుంకుమ రాసుకొని
కంటికి కాటుక పెట్టుకొని - ఆడవె ఆడవె అమ్మణ్ణి
పువ్వులు తలలో ముడుచుకొని - తిలకం నుదుటా దిద్దుకొని
బుగ్గన చుక్క పెట్టుకొని - ఆడవె ఆడవె అమ్మణ్ణి
|
gamdham meDaku puusukoni - pasupuu kumkuma raasukoni
kamTiki kaaTuka peTTukoni - aaDave aaDave ammaNNi
puvvulu talaloa muDuchukoni - tilakam nuduTaa diddukoni
buggana chukka peTTukoni - aaDave aaDave ammaNNi
|
గడప లన్నింటిలోను ఏ గడప మేలు
మహ లక్ష్మి నర్థించు మా గడప మేలు
అరుగు లన్నింతిలోను ఏ అరుగు మేలు
అథితులందరుజేరు మా గడప మేలు
వీధు లన్నింటిలోన ఏ వీధి మేలు
విధ్వాంసులుండేటి మా వీధి మేలు
ఊరుల్లంతిలోనూ ఏ ఊరు మేలు
పాది పంటలు విరసిల్లు మా ఊరు మేలు
గురువు లందరిలో ఏ గురువు మేలు
వేదసారము తెల్పు మా గురువు మేలు
|
gaDapa lannimTiloanu ae gaDapa maelu
maha lakshmi narthimchu maa gaDapa maelu
arugu lannimtiloanu ae arugu maelu
athitulamdarujaeru maa gaDapa maelu
viidhu lannimTiloana ae viidhi maelu
vidhvaamsulumDaeTi maa viidhi maelu
uurullamtiloanuu ae uuru maelu
paadi pamTalu virasillu maa uuru maelu
guruvu lamdariloa ae guruvu maelu
vaedasaaramu telpu maa guruvu maelu
|
గోరంత దీపం కొండంత వెలుగు
మాయింటి పాపాయి మా కంటి వెలుగు
వెచ్చని సూరీడు పగలంతా వెలుగు
చల్లని చేంద్రుడు రాత్రంతా వెలుగు
ముత్యమంతా పసుపు ముఖమంతా వెలుగు
ముత్తైదు కుంకుమా బ్రతుకంతా వెలుగు
గురువు మాట వింటె గుణమంత వెలుగు
మంచి చదువులు నీకు భవిషత్తు వెలుగు
|
goaramta deepam komDamta velugu
maayimTi paapaayi maa kamTi velugu
vecchani suureeDu pagalamtaa velugu
challani chaemdruDu raatramtaa velugu
mutyamamtaa pasupu muKamamtaa velugu
muttaidu kumkumaa bratukamtaa velugu
guruvu maaTa vimTe guNamamta velugu
mamchi chaduvulu neeku bhavishattu velugu
|
గుడుగుడుకుంచం గుండేరాగం,
పావడపట్టల పడిగేరాగం,
అప్పడాలగు¬ఋ¬ఋం ఆడుకోబోతే
పే పేగు¬ఋ¬ఋం పెళ్ళికి పోతే,
అన్నా! అన్నా! నీ పెళ్లెపుడంటే
రేపుగాక, ఎల్లుండి
- కత్తిగాదు, బద్దాగాదు గప్, చిప్
|
guDuguDukumcham gumDaeraagam,
paavaDapaTTala paDigaeraagam,
appaDaalagu¬R¬Rm aaDukoaboatae
pae paegu¬R¬Rm peLLiki poatae,
annaa! annaa! nee peLlepuDamTae
raepugaaka, ellumDi
- kattigaadu, baddaagaadu gap, chip
|
|
|
చ ఛ
|
|
చందమామ తెలుపు - సన్నజాజి తెలుపు
మల్లె పువ్వు తెలుపు - మంచి మనసు తెలుపు
మందారం ఎరుపు - సింధూరం ఎరుపు
మంసెన పువ్వు ఎరుపు - మంచి మంట ఎరుపు
జీది గింజ నలుపు - కట్టె బొగ్గు నలుపు
కారు చీకటి నలుపు - కాకమ్మ నలుపు
చామంతి పసుపు - పూబంతి పసుపు
బంగారం పసుపు - గన్నేరు పసుపు
సన్నజాజి తెలుపు - చామంతి పసుపు
మందారం ఎరుపు - కోకిలమ్మ నలుపు
|
chamdamaama telupu - sannajaaji telupu
malle puvvu telupu - mamchi manasu telupu
mamdaaram erupu - simdhuuram erupu
mamsena puvvu erupu - mamchi mamTa erupu
jeedi gimja nalupu - kaTTe boggu nalupu
kaaru cheekaTi nalupu - kaakamma nalupu
chaamamti pasupu - puubamti pasupu
bamgaaram pasupu - gannaeru pasupu
sannajaaji telupu - chaamamti pasupu
mamdaaram erupu - koakilamma nalupu
|
చెన్నా పట్నం చెరకు ముక్కా
నీకో ముక్కా నాకో ముక్క
భీముని పట్నం బిందెల జోడూ
నీకో బిందె నాకో బిందె
కాళీ పట్నం కాసుల పేరు
నీకో పేరూ నాకో పేరూ
కొడాపల్లీ కొయ్యా బొమ్మా
నీకో బొమ్మా నాకో బొమ్మా
నిర్మలపట్నం బొమ్మల పలక
నీకో పలకా నాకో పలకా
బంగిన పల్లి మామిది పండూ
నీకో పండూ నాకో పండూ
ఇస్తా నుండూ తెచ్చేదాకా
చూస్తా వుందూ ఇచ్చేదాకా
|
chennaa paTnam cheraku mukkaa
neekoa mukkaa naakoa mukka
bheemuni paTnam bimdela joaDuu
neekoa bimde naakoa bimde
kaaLii paTnam kaasula paeru
neekoa paeruu naakoa paeruu
koDaapallee koyyaa bommaa
neekoa bommaa naakoa bommaa
nirmalapaTnam bommala palaka
neekoa palakaa naakoa palakaa
bamgina palli maamidi pamDuu
neekoa pamDuu naakoa pamDuu
istaa numDuu tecchaedaakaa
chuustaa vumduu icchaedaakaa
|
చెట్టు మిది కాకి కావ్ కావ్
గోడ మిది పిల్లి మ్యావ్ మ్యావ్
మందలో గొ¬ర్¬రె పిల్ల బా బా
తల్లి చూసిన మేక పిల్ల మే మే
దొంగను చూసిన కుక్క భౌ భౌ
ఇల్లెక్కిన కోడి కొక్కొరోకో
|
cheTTu midi kaaki kaav kaav
goaDa midi pilli myaav myaav
mamdaloa go¬r¬re pilla baa baa
talli chuusina maeka pilla mae mae
domganu chuusina kukka bhou bhou
illekkina koaDi kokkoroakoa
|
చిన్నారి పాపాయి శ్రీరామ నవమి
వచ్చేసినది నేడు వేడుకలు చూడు
ఈ నవమినాడె ఇల జనియించినాడు
సీతామనోహరుడు శ్రీ రామ విభుదు
సీతమ్మ తల్లికీ శ్రీ రామునకును
తలపై బోశారు తలంబ్రాలు జనులు
బుట్టెడు వడపప్పు పెట్టిరందరికీ
పానకం బిందెడూ పంచిరందరికీ
|
chinnaari paapaayi Sreeraama navami
vacchaesinadi naeDu vaeDukalu chuuDu
ee navaminaaDe ila janiyimchinaaDu
seetaamanoaharuDu Sree raama vibhudu
seetamma tallikii Sree raamunakunu
talapai boaSaaru talambraalu janulu
buTTeDu vaDapappu peTTiramdarikii
paanakam bimdeDuu pamchiramdarikii
|
చెమ్మ చెక్క , చారడేసి మొగ్గ
అట్లుపొయ్యంగ, ఆరగించంగ
ముత్యాల చమ్మ చెక్క ముగ్గు లెయ్యంగ
రత్నాల చమ్మచెక్క రంగు లెయ్యంగ
పగడాల చమ్మచెక్క పందీరెయ్యంగ
పందిట్లో మా బావ పెండ్లి చెయ్యంగ
చూచివద్దాం రండి, సుబ్బారాయుడి పెళ్ళి
(సూర్య దేవుని) చూసివత్తము రండి
మా వాళ్లింట్లో పెండ్లి, మళ్లీ వద్దాం రండి
దొరగారింట్లో పెండ్లి దోచుకు వద్దాం రండి!
|
chemma chekka , chaaraDaesi mogga
aTlupoyyamga, aaragimchamga
mutyaala chamma chekka muggu leyyamga
ratnaala chammachekka ramgu leyyamga
pagaDaala chammachekka pamdeereyyamga
pamdiTloa maa baava pemDli cheyyamga
chuuchivaddaam ramDi, subbaaraayuDi peLLi
(suurya daevuni) chuusivattamu ramDi
maa vaaLlimTloa pemDli, maLlee vaddaam ramDi
doragaarimTloa pemDli doachuku vaddaam ramDi!
|
చిలుకల్లు చిలుకల్లు అందురేకాని
చిలుకలకు రూపేమి పలుకులేగాని
హసల్లు హంసల్లు అందురేకాని
హంసలకు రూపేమి ఆటలేగాని
పార్వాలు పార్వాలు అందురేకాని
పార్వాలకు రూపేమి పాటలేగాని
కోయిల్లు కోయిల్లు అందురేకాని
కోయిల్లకు రూపేమి గోషలేగాని
చిలకల్లు మా ఇంటి చిన్న కోడళ్ళు
హంసలు మా ఇంటి ఆడపడుచుల్లు
పార్వాలు మా ఇంటి బాలపాపల్లు
కోయిల్లు మా ఇంటి కొత్తకోడళ్ళు
|
chilukallu chilukallu amduraekaani
chilukalaku ruupaemi palukulaegaani
hasallu hamsallu amduraekaani
hamsalaku ruupaemi aaTalaegaani
paarvaalu paarvaalu amduraekaani
paarvaalaku ruupaemi paaTalaegaani
koayillu koayillu amduraekaani
koayillaku ruupaemi goashalaegaani
chilakallu maa imTi chinna koaDaLLu
hamsalu maa imTi aaDapaDuchullu
paarvaalu maa imTi baalapaapallu
koayillu maa imTi kottakoaDaLLu
|
చిలకమ్మ పెండ్లి అని - చెలికత్తెలందరూ
చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు
పందిట పిచ్చుకలు - సందడి చేయగ
కాకుల మూకలు - బాకాలూదగ
కప్పలు బెక బెక - డప్పులు కొట్టగా
కొక్కొరోకోయని - కోడికూయగా
ఝుమ్మని తుమ్మెద - తంబుర మీటగ
కుహూ కుహూ యని - కోయిల పాడగా
పిల్ల తుమ్మెరలు - వేణువూదగా
నెమలి సొగసుగా - నాట్యం చేయగా
సాలీడిచ్చిన చావు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగా
మల్లీమాలతి - మాధవీ లతలు
పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్చగ
మైనా గోరింక మంత్రము చదివెను
చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ
చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తై
-గిడుగు వెంకట సీతాపతి
|
chilakamma pemDli ani - chelikattelamdaruu
cheTlu simgaarimchi - chaeri kuurchunnaaru
pamdiTa picchukalu - samdaDi chaeyaga
kaakula muukalu - baakaaluudaga
kappalu beka beka - Dappulu koTTagaa
kokkoroakoayani - koaDikuuyagaa
Jummani tummeda - tambura meeTaga
kuhuu kuhuu yani - koayila paaDagaa
pilla tummeralu - vaeNuvuudagaa
nemali sogasugaa - naaTyam chaeyagaa
saaleeDicchina chaavu kaTTukoni
pemDlikumaaruDu bimkamu chuupagaa
malleemaalati - maadhavee latalu
pemDli kumaaruni - pemDli kuuturini
deevistuu tama puuvulu raalchaga
mainaa goarimka mamtramu chadivenu
chilakamma magaDamta - chirunavvu navvutuu
chilakamma meDakaTTe - chimtaakupustai
-giDugu vemkaTa seetaapati
|
చిట్టీ చిలకమ్మా - అమ్మాకొట్టిందా?
తోటలో కెళ్ళావా? - పండూ తెచ్చావా?
గూట్లో పెట్టావా? - గుట్టుక్కు మింగావా?
|
chittee chilakammaa - ammaakoTTimdaa?
toaTaloa keLLaavaa? - pamDuu tecchaavaa?
guuTloa peTTaavaa? - guTTukku mimgaavaa?
|
చుట్టాల సురభి - బొటన వ్రేలు
కొండేల కొరవి - చూపుడువ్రేలు
పుట్టుసన్యాసి - మధ్యవ్రేలు
ఉంగరాలభోగి - ఉంగరపు వ్రేలు
పెళ్ళికి పెద్ద - చితికెనవ్రేలు
తిందాం తిందాం ఒకవేలు!
ఎట్లా తిందాం ఒకవేలు?
అప్పుచేసి తిందాం ఒకవేలు!
అప్పెత్టా తీరుతుంది ఒకవేలు?
ఉనాగదా నేను అన్నింటికీ
పొట్టివాణ్ణి గట్టివాణ్ణి బొటనివేలు!
|
chuTTaala surabhi - boTana vraelu
komDaela koravi - chuupuDuvraelu
puTTusanyaasi - madhyavraelu
umgaraalabhoagi - umgarapu vraelu
peLLiki pedda - chitikenavraelu
timdaam timdaam okavaelu!
eTlaa timdaam okavaelu?
appuchaesi timdaam okavaelu!
appetTaa teerutumdi okavaelu?
unaagadaa naenu annimTikee
poTTivaaNNi gaTTivaaNNi boTanivaelu!
|
చిట్టి చిట్టి మిరియాలు - చెట్టు కింద పోసి
పుట్ట మన్ను తెచ్చి - బొమ్మరిల్లు కట్టి
అల్లం వారింటికి - చల్లకు పోతె
అల్లం వారి కుక్క - భౌ భౌ మన్నది
మా కాళ్ళ గజ్జలు - ఘల్లు ఘల్లు మన్నవి
చంకలో పాప - కేర్ కేర్ మన్నది
|
chiTTi chiTTi miriyaalu - cheTTu kimda poasi
puTTa mannu tecchi - bommarillu kaTTi
allam vaarimTiki - challaku poate
allam vaari kukka - bhou bhou mannadi
maa kaaLLa gajjalu - Gallu Gallu mannavi
chamkaloa paapa - kaer kaer mannadi
|
|
|
జ ఝ
|
|
జో అచ్యుతానంద జో జో ముకుందా
రావె పరమానంద రామగోవింద
నందు నింటనుగేరి నయముమీరంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరంబున నున్న కంసుని బడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
ఠీవితో నేలిన దేవకీవట్టి
|
joa achyutaanamda joa joa mukumdaa
raave paramaanamda raamagoavimda
namdu nimTanugaeri nayamumiiramga
chamdravadanalu niiku saeva chaeyamga
goavardhanambella goDugugaa baTTi
kaavarambuna nunna kamsuni baDagoTTi
niivu madhuraapuramu naelajaepaTTi
Thiivitoa naelina daevakiivaTTi
|
జగతి పై రామయ్య జన్మించాడు
సత్యమ్ము లోకాన స్థాపించినాడు
తల్లిదండ్రుల మాట చెల్లించినాడు
ఇల్లాలితోపాటు హింసపడ్డాదు
అయోధ్యరామయ్య అన్నయ్య మాకు
వాలుగన్నుల సీత వదినమ్మ మాకు
|
jagati pai raamayya janmimchaaDu
satyammu loakaana sthaapimchinaaDu
tallidamDrula maaTa chellimchinaaDu
illaalitoapaaTu himsapaDDaadu
ayoadhyaraamayya annayya maaku
vaalugannula seeta vadinamma maaku
|
|
|
త థ
|
|
తారంగం తారంగం - తాండవ కృష్ణా తారంగం
అల్లరి కృష్ణా తారంగం - పిల్లల కృష్ణా తారంగం
ముద్దుల కృష్ణా తారంగం - మురిపాల కృష్ణా తారంగం
మాధవ కృష్నా తారంగం - యశోదా కృష్ణా తారంగం
వేణు నాధా తారంగం - వెంకట రమణా తారంగం
రాధా కృష్ణా తారంగం - రమణీయ కృష్ణా తారంగం
గోపాల కృష్ణా తారంగం - గోకుల నాధ తారంగం
వెన్నెల దొంగా తారంగం - చిన్ని కృష్ణా తారంగం
చిన్మయ రూపా తారంగం - చిద్విలాస తారంగం
విశ్వమంతయు తారంగం - నీవేనయ్యా తారంగం
|
taaramgam taaramgam - taamDava kRshNaa taaramgam
allari kRshNaa taaramgam - pillala kRshNaa taaramgam
muddula kRshNaa taaramgam - muripaala kRshNaa taaramgam
maadhava kRshnaa taaramgam - yaSoadaa kRshNaa taaramgam
vaeNu naadhaa taaramgam - vemkaTa ramaNaa taaramgam
raadhaa kRshNaa taaramgam - ramaNiiya kRshNaa taaramgam
goapaala kRshNaa taaramgam - goakula naadha taaramgam
vennela domgaa taaramgam - chinni kRshNaa taaramgam
chinmaya roopaa taaramgam - chidvilaasa taaramgam
viSvamamtayu taaramgam - neevaenayyaa taaramgam
|
తల్లీభారతి
- దాసరథి
తల్లీ భారతి వందనం - తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం - మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒదిలో మల్లెలము - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - భావిపౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం - భావిపౌరులం మనం మనం
|
talleebhaarati
- daasarathi
tallee bhaarati vamdanam - tallee bhaarati vamdanam
nee illae maa namdanam - maemamtaa nee pillalamu
nee challani odiloa mallelamu - tallidamDrulanu guruvulanu
ellavaeLala kolichedamammaa - tallidamDrulanu guruvulanu
ellavaeLala kolichedamammaa - chaduvulu baagaa chadivedamammaa
jaati gouravam pemchedamammaa - chaduvulu baagaa chadivedamammaa
jaati gouravam pemchedamammaa - kulamata bhaedam marachedamu
kalatalu maani melagedamu - kulamata bhaedam marachedamu
kalatalu maani melagedamu - maanavulamtaa samaanulamTuu
mamatanu samatanu pemchedamu - telugu jaatikee abhyudayam
navabhaaratikae navoadayam - telugu jaatikee abhyudayam
navabhaaratikae navoadayam - bhaavipourulam manam manam
bhaarata janulaku jayam jayam - bhaavipourulam manam manam
|
|
|
న
|
|
నల్లని వాడయ్య ఆ చిన్ని కృష్ణయ్య
అందుకోబోతేను అందరాడమ్మ
కళీయమర్ధనం చేసినాడమ్మ
వేణునాదపు విద్య నేర్చినాడమ్మ
ఉట్టిపై వెన్నను కృష్ణయ్య తీస్తేను
ఉట్టిలో టెంకాయ మీరు కొట్టండి
ఉల్లాసమొప్పంగ ఉట్టికెగరండయ్య
ఉట్టిలో టెంకాయ ఎగిరి కొట్టండయ్య
కొట్టి తినండైయ్య కొబ్బరి బెల్లాలు
ఉట్టి అదిగో వేగము ఉరికి రారంది
|
nallani vaaDayya aa chinni kRshNayya
amdukoaboataenu amdaraaDamma
kaLiiyamardhanam chaesinaaDamma
vaeNunaadapu vidya naerchinaaDamma
uTTipai vennanu kRshNayya teestaenu
uTTiloa Temkaaya meeru koTTamDi
ullaasamoppamga uTTikegaramDayya
uTTiloa Temkaaya egiri koTTamDayya
koTTi tinamDaiyya kobbari bellaalu
uTTi adigoa vaegamu uriki raaramdi
|
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మనకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!
|
naaraayaNa naaraayaNa allaa allaa
maa paaliTa tamDrii nee pillala mae mella !!naaraayaNa!!
matamannadi naakamTiki manakaitae
matamannadi naamanasuku mabbaitae
matam vaddu gitam vaddu maayaamarmamvaddu !!naaraayaNa!!
dvaeshaalu roashaalu tecchae matamaitae
kalahaalu kakshalu kaligimchaedae gatamaitae
matam vaddu gitam vaddu
maaraNa hoamam vaddu !!naaraayaNa!!
matamannadi gaamdheejii hitamaitae
matamannadi loakaaniki hitamaitae
himduvulam muslimulam
amdaramu maanavulam,
amdaramuu soadarulam !!naaraayaNa!!
|
|
|
ప ఫ
|
పాడు బడిన కోట - కోట వెనక పేట
పేట వరకు బాట - బాట పక్క తోట
తోట లోపల మోట - మోట కోసం రాట
రాట తిరుగుచోట - రాగాల పాట
పాట పాడు నోట - పంచదార ఊట
అందుకే పూట పూట వినిపించు పాట
చిన్నారి నోట ఓ కొత్త పాట
|
paaDu baDina koaTa - koaTa venaka paeTa
paeTa varaku baaTa - baaTa pakka toaTa
toaTa loapala moaTa - moaTa koasam raaTa
raaTa tiruguchoaTa - raagaala paaTa
paaTa paaDu noaTa - pamchadaara uuTa
amdukae puuTa puuTa vinipimchu paaTa
chinnaari noaTa oa kotta paaTa
|
ప్రొద్దున మనము లేవాలి - పళ్ళను బాగా తోమాలి
చక్కగ స్నానం చేయాలి - చింపిరి తలనూ దువ్వాలి
ఉతికిన బట్టలు కట్టాలి - గ్లాసెడు పాలు తాగాలి
దేవునికి దండం పెట్టలి - చక్కగ బడికి పోవాలి
గురువు మాట వినాలి - చదువులు చక్కగ చదవాలి.
|
prodduna manamu laevaali - paLLanu baagaa toamaali
chakkaga snaanam chaeyaali - chimpiri talanuu duvvaali
utikina baTTalu kaTTaali - glaaseDu paalu taagaali
daevuniki damDam peTTali - chakkaga baDiki poavaali
guruvu maaTa vinaali - chaduvulu chakkaga chadavaali.
|
పప్పు పెట్టి పాయసం పెట్టి
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి
కూర పెట్టి ఊరగాయ పెట్టి
నెయ్యిపోసి ముద్ద చేసి
ముద్దచేసి తినిపించి
చేయి కడిగి మూతికడిగి
తాతగారింటికి దారేదండీ
అత్తారింటికి దారేదండీ
ఇట్లా పోయి అట్లా పోయి
అదిగో వచ్చాం ఇదిగో వచ్చాం
చక్కా వచ్చం చక్కగవచ్చాం
చక్కిలి గిలిగిలి చక్కిలి గిలి
|
pappu peTTi paayasam peTTi
annam peTTi appacchi peTTi
kuura peTTi uuragaaya peTTi
neyyipoasi mudda chaesi
muddachaesi tinipimchi
chaeyi kaDigi muutikaDigi
taatagaarimTiki daaraedamDii
attaarimTiki daaraedamDii
iTlaa poayi aTlaa poayi
adigoa vacchaam idigoa vacchaam
chakkaa vaccham chakkagavacchaam
chakkili giligili chakkili gili
|
పిల్లి పిల్లి వచ్చింది - ఉట్టి పైకి ఎగిరింది
కావలున్న ముసలవ్వ - కర్ర తీసి విసిరింది
పాలకుండ పగిలింది - పిల్లి పారిపోయింది
అవ్వ అందుకేడ్వటం - తాత చూసి నవ్వటం
|
pilli pilli vacchimdi - uTTi paiki egirimdi
kaavalunna musalavva - karra tiisi visirimdi
paalakumDa pagilimdi - pilli paaripoayimdi
avva amdukaeDvaTam - taata chuusi navvaTam
|
పాపాయి కన్నుల్లు కలువరేకుల్లు
పాపాయి జుంపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచిముత్యాలు
పాపాయి చేతులు పొట్ట్లకాయల్లు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిలకల్లు
పాపాయి చిన్నెలు బాలకృష్ణుని వన్నెల్లు
|
paapaayi kannullu kaluvaraekullu
paapaayi jumpaalu paTTukucchullu
paapaayi damtaalu mamchimutyaalu
paapaayi chaetulu poTTlakaayallu
paapaayi pikkalu mokkajonna pottulu
paapaayi chekkulu pasivennamuddallu
paapaayi vannelu pasinimmapamDullu
paapaayi palukulu pamchadaara chilakallu
paapaayi chinnelu baalakRshNuni vannellu
|
పిల్లల్లారా పాపల్లారా
- దాశరథి
పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు.
మీ మనస్సుల్లో దేవుడు కొలువై ఉన్నాడు.
ఉన్నాడు అతడున్నడు.
భారత మాతకు ముద్దులబిడ్డలు, మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమేలే
రేపటి భారత పౌరుల్లారా...
భారత దేశం ఒకటేఇల్లు భారత మాతకు మీరే కళ్లు,
మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి బడిలోబయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి. పిల్లల్లారా!!
|
pillallaaraa paapallaaraa
- daaSarathi
pillallaaraa paapallaaraa raepaTi bhaaratapourullaaraa
peddalakae oka daarini chuupae pinnallaaraa pillallaaraa
mee kannulloa punnami jaabili
unnaaDu, unnaaDu pomchunnaaDu.
mee manassulloa daevuDu koluvai unnaaDu.
unnaaDu ataDunnaDu.
bhaarata maataku muddulabiDDalu, meeraelae meeraelae
ammaku meepai amtaelaeni praemalae, pillallaaraa praemaelae
raepaTi bhaarata pourullaaraa...
bhaarata daeSam okaTaeillu bhaarata maataku meerae kaLlu,
meerae kaLlu, meerae kaLlu
jaatipataakam paikegaraesi
jaati gouravam kaapaaDamDi baDiloabayaTaa amtaa kalisi
bhaarateeyulai melagamDi kanyaakumaariki kaaSmeeraaniki
anyoanyatanu pemchamDi veeDani bamdham vaeyamDi. pillallaaraa!!
|
|
|
బ భ
|
|
బడాయి పిల్లి లడాయి కెళ్ళి
ఎలుకను చంపి ఏనుగె అంది
పులినే తానని పొంగిన పిల్లి
కుక్కను చూసి ఒక్కటే పరుగు
|
baDaayi pilli laDaayi keLLi
elukanu champi aenuge amdi
pulinae taanani pomgina pilli
kukkanu chuusi okkaTae parugu
|
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది
పడమట ఇంట కాపురం చేయనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర కట్టన్నన్నది
మామ తెచ్చిన మల్లె పూలు ముడవనన్నది
మొగుడి చేత మొట్టికాయలు తింటన్నన్నది
|
burru piTTa burru piTTa turrumannadi
paDamaTa imTa kaapuram chaeyanannadi
atta tecchina kotta cheera kaTTannannadi
maama tecchina malle poolu muDavanannadi
moguDi chaeta moTTikaayalu timTannannadi
|
బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెల్తివి?
రాజుగారి తోటలోన మేత కెల్తిని
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి?
రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని!
పూల చెట్లు చూసినీవు ఊరకుంటివా?
నోరూరగ పూలచెట్లు మేసివస్తిని.
మేసివస్తే నిన్ను భటులు ఏమి చేసిరి?
భటులు వచ్చి నా కాళ్ళు విరగగొట్టిరి.
|
bujji maeka bujji maeka aeDakeltivi?
raajugaari toaTaloana maeta keltini
raajugaari toaTaloana aemi chuustivi?
raaNigaari poola cheTla sogasu chuustini!
poola cheTlu chuusineevu uurakumTivaa?
noaruuraga poolacheTlu maesivastini.
maesivastae ninnu bhaTulu aemi chaesiri?
bhaTulu vacchi naa kaaLLu viragagoTTiri.
|
|
|
మ
|
మన పండుగలు
దసరా పండుగ వచ్చినది
దర్జా లెన్నో తెచ్చినవి
దండిగ డబ్బుల్లు వచ్చినవి
కోరికలన్నీ తీరినవి
సంక్రాంతి పండుగ వచ్చినది
సరదా లెన్నో తెచ్చినది
కొత్త బట్టలి కట్టాము
బహుమతులెన్నో పొందాము
దీపావళి పందుగ వచ్చినది
దివిటీ లెన్నో వెలిగించినది
చీకటి నంతా ప్రారద్రోలి
చిరంజీవిగా నిలచింది
ఉగాది పండుగ వచ్చింది
జగాన వెలుగు నిందింది
చేదు వగరు తీలి గుర్తులతో
జీవిత మంత సాగింది.
|
mana pamDugalu
dasaraa pamDuga vacchinadi
darjaa lennoa tecchinavi
damDiga Dabbullu vacchinavi
koarikalannee teerinavi
samkraamti pamDuga vacchinadi
saradaa lennoa tecchinadi
kotta baTTali kaTTaamu
bahumatulennoa pomdaamu
deepaavaLi pamduga vacchinadi
diviTii lennoa veligimchinadi
cheekaTi namtaa praaradroali
chiramjeevigaa nilachimdi
ugaadi pamDuga vacchimdi
jagaana velugu nimdimdi
chaedu vagaru teeli gurtulatoa
jeevita mamta saagimdi.
|
మంచి గంధం మాచికాయ
ఊదొత్తి ఉమ్మకాయ
కప్పురంబు కచ్చోరంబు
కస్తూరికాగై రికమ్ము
సన్నవేరు సాంబరాణి
గంధ ధూపములు గండాదీపం
హారతి హోమం అగ్ని ధూమములు
దేవత సత్తువ దివికె జోతల
పురిటి సుద్దికే పున్నెము జోతలు
|
mamchi gamdham maachikaaya
uudotti ummakaaya
kappurambu kaccoarambu
kastuurikaagai rikammu
sannavaeru saambaraaNi
gamdha dhuupamulu gamDaadeepam
haarati hoamam agni dhuumamulu
daevata sattuva divike joatala
puriTi suddikae punnemu joatalu
|
మా పాపమామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసిమ్హావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
వరమగురుదేవ పరశురామావతారం
రక్షించు రామయ్య రామావతారం
బంటైన బంధువులు బలభద్రావతారం
బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం
కలివిడితో మా యన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్దిల్లు నా తండ్రి
చిట్టి నా కన్నోడు శ్రీ కృష్ణావతారం
|
maa paapamaamallu matsyaavataaram
kuurchunna taatallu kuurmaavataaram
varasaina baavallu varaahaavataaram
naTTimTa naayatta narasimhaavataaram
vaasigala boTTellu vaamanaavataaram
varamagurudaeva paraSuraamaavataaram
rakshimchu raamayya raamaavataaram
bamTaina bamdhuvulu balabhadraavataaram
buddhitoa maa chiTTi buddhaavataaram
kaliviDitoa maa yanna kalikaavataaram
vardhillu pasipaapa vardillu naa tamDri
chiTTi naa kannoaDu Sree kRshNaavataaram
|
మా బావ వీరుడు - మంచం దిగడు
చిమంటే చాలు - చిందులేస్తాడు
ఎలుకంటే చాలు - ఎగిరిపడతాదు
పిల్లి అంటే చాలు - పారిపోతాదు
|
maa baava veeruDu - mamcham digaDu
chimamTae chaalu - chimdulaestaaDu
elukamTae chaalu - egiripaDataadu
pilli amTae chaalu - paaripoataadu
|
|
|
ర
|
|
రింగు రింగు బిళ్ల - రూపాయి దండ
దండ కాదురా! - తామర మొగ్గ
మొగ్గ కాదురా! మోదుగ నీడ
నీడ కాదురా! - నిమ్మల బావి
బావి కాదురా! - బచ్చల కూర
కూర కాదురా! - కమ్మరి మెట్టు
మెట్టు కాదురా! - మేదర సిబ్బి
సిబ్బి కాదురా! - చీపురు కట్ట
కట్ట కాదురా! - కావడి బద్ద
బద్ద కాదురా! - బారెదు మీసం
మీసం కాదురా! - మిరియాల పొడుం
పొదుం కాదురా! - పోతురాజు
|
rimgu rimgu biLla - ruupaayi damDa
damDa kaaduraa! - taamara mogga
mogga kaaduraa! moaduga neeDa
neeDa kaaduraa! - nimmala baavi
baavi kaaduraa! - bacchala kuura
kuura kaaduraa! - kammari meTTu
meTTu kaaduraa! - maedara sibbi
sibbi kaaduraa! - cheepuru kaTTa
kaTTa kaaduraa! - kaavaDi badda
badda kaaduraa! - baaredu meesam
meesam kaaduraa! - miriyaala poDum
podum kaaduraa! - poaturaaju
|
|
|
ల
|
|
లాలి శ్రీ కృష్ణయ్య నీలమేఘవర్ణా
బాలగోపాల నీవు పవ్వళించవయ్య !!లాలి!!
శృంగారించిన మంచి బంగారుటుయ్యాలలో
శంఖ చక్ర ధరాస్వామి నిదురబోవయ్య !!లాలి!!
శేష పానుపు పైన శయనించు నా కృష్నా
దోషాపహార వసుదేవతనయి నిద్రపోవయ్య !!లాలి!!
|
laali Sree kRshNayya niilamaeGavarNaa
baalagoapaala niivu pavvaLimchavayya !!laali!!
SRmgaarimchina mamchi bamgaaruTuyyaalaloa
SamKa chakra dharaasvaami niduraboavayya !!laali!!
Saesha paanupu paina Sayanimchu naa kRshnaa
doashaapahaara vasudaevatanayi nidrapoavayya !!laali!!
|
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
లాలమ్మ గుర్రాలు లంకల్లో మేసె
బుల్లెమ్మ గుర్రాలు బీడుల్లో మేసె
అప్పన్న గుర్రాలు అడవుల్లో మేసె
ఊరుకో అబ్బాయి వెర్రి అబ్బాయి
ఉగ్గెట్టు మీయమ్మ ఊరికెళ్ళింది
పాలిచ్చు మీ యమ్మ పట్నమెళ్ళింది
నీరోసె మీయమ్మ నీళ్ళకెళ్ళింది
లాలి లాలమ్మ లాలి లాలమ్మ
|
laali laalamma laali laalamma
laalamma gurraalu lamkalloa maese
bullemma gurraalu biiDulloa maese
appanna gurraalu aDavulloa maese
uurukoa abbaayi verri abbaayi
uggeTTu miiyamma uurikeLLimdi
paalicchu mii yamma paTnameLLimdi
niiroase miiyamma niiLLakeLLimdi
laali laalamma laali laalamma
|
లాల ఉయ్యామమ్మ జోల ఉయ్యాల
ఊగేటి మా పాప తూగుటుయ్యాల
చిల్లి ఉయ్యాలమ్మ పొట్టి ఉయ్యాల
పట్టి ముద్దులపాప పసిడి ఉయ్యాల
పాల ఉయ్యాలమ్మ గాలి ఉయ్యాల
ఆకాశవీధిలో కెగురు ఉయాల
బాల ఉయ్యాలమ్మ జోల ఉయ్యాల
పాలబుగ్గ పాప మేలి ఉయ్యాల
|
laala uyyaamamma joala uyyaala
uugaeTi maa paapa tuuguTuyyaala
chilli uyyaalamma poTTi uyyaala
paTTi muddulapaapa pasiDi uyyaala
paala uyyaalamma gaali uyyaala
aakaaSaviidhiloa keguru uyaala
baala uyyaalamma joala uyyaala
paalabugga paapa maeli uyyaala
|
|
|
వ
|
|
వచ్చింది వచ్చింది సంక్రాంతి పండుగా
సిరులెన్నో తెచ్చింది మా యిల్లు నిండుగా
అందాల ముగ్గులకు రంగవల్లులు తోడుగా
బంగారు ధాన్యాలు ఇల్లంతా నిండుగా
గణగణ మోతలతో గంగిరెద్దుల వాండ్రు
కిలకిలా నవ్వులతో పాపాయిలంతను
ఎముకులను కొ¬ఋకు చలికి తట్టుకొని
భోగి మంటల ముందు వెచ్చంగా కూర్చుండి
తలార స్నానంబు చక్కంగా జేసి
సంక్రాంతి లక్ష్మిని చల్లంగా పిలిచి
మాయింట సిరులెన్నో కురుపించు తల్లీ
మమ్ములను దయతోడ కరుణించు తల్లీ
పాది పంటలతో పసిడి భాగ్యాలతో
పరవళ్ళు తొక్కుతు నివసించు మా తల్లి
పందుగ రోజు భక్తి శ్రద్దలతో మేము
మ్రొక్కి కొలిచెదమమ్మ మాకన్న తల్లీ
తెల్లనీముగ్గులు చక్కగా వేసాము
పూలతో నమర్చి గొబ్బిళ్ళు పేర్చాము
మా యింట నెలకొన్న మా కన్నతల్లి
మమ్ములను దయజూడు మాకల్పవల్లి
|
vacchimdi vacchimdi samkraamti pamDugaa
sirulennoa tecchimdi maa yillu nimDugaa
amdaala muggulaku ramgavallulu toaDugaa
bamgaaru dhaanyaalu illamtaa nimDugaa
gaNagaNa moatalatoa gamgireddula vaamDru
kilakilaa navvulatoa paapaayilamtanu
emukulanu ko¬Rku chaliki taTTukoni
bhoagi mamTala mumdu vecchamgaa kuurchumDi
talaara snaanambu chakkamgaa jaesi
samkraamti lakshmini challamgaa pilichi
maayimTa sirulennoa kurupimchu tallii
mammulanu dayatoaDa karuNimchu tallii
paadi pamTalatoa pasiDi bhaagyaalatoa
paravaLLu tokkutu nivasimchu maa talli
pamduga roaju bhakti Sraddalatoa maemu
mrokki kolichedamamma maakanna tallii
tellaneemuggulu chakkagaa vaesaamu
puulatoa namarchi gobbiLLu paerchaamu
maa yimTa nelakonna maa kannatalli
mammulanu dayajuuDu maakalpavalli
|
వచ్చే వచ్చే దొంగా వచ్చే - దొరికేవాళ్ళను పట్టా వచ్చే
దాగండమ్మా దాగండీ - దాగుడు మూతా ఆడండీ
కళ్ళకు చేతులు తీసేశా - ఇదిగో దొంగను వదిలేశా
దొంగకు అందక రారండీ - తల్లిని వచ్చీ తాకండి
|
vacchae vacchae domgaa vaccae - dorikaevaaLLanu paTTaa vacchae
daagamDammaa daagamDii - daaguDu muutaa aaDamDii
kaLLaku chaetulu tiisaeSaa - idigoa domganu vadilaeSaa
domgaku amdaka raaramDii - tallini vacchii taakamDi
|
వాన వచ్చి వాగులు పారే
కోడి వచ్చి గుడ్డు పెట్టే
తాత వచ్చి తొంగి చూసే
అవ్వ వచ్చి గుడ్డు తీసే
అమ్మ వచ్చి అట్టు వేసె
అన్న వచ్చి గుటుక్కున మింగె
నాకు మాత్రం గుండు సున్నా
|
vaana vacchi vaagulu paarae
koaDi vacchi guDDu peTTae
taata vacchi tomgi chuusae
avva vacchi guDDu teesae
amma vacchi aTTu vaese
anna vacchi guTukkuna mimge
naaku maatram gumDu sunnaa
|
వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప
కొండ మీది గుండురాయి
కొక్కిరాయి కాలు విరెగె
దానికేమి మందు?
వేపాకు పసుపూ వీల్లుల్లిపాయ
నూనమ్మ బొట్టు
నూటొక్క సారి
పూటకొక్క తూరి
|
vaanaa vaanaa vallappa
vaakili tirugu chellappa
komDa meedi gumDuraayi
kokkiraayi kaalu virege
daanikaemi mamdu?
vaepaaku pasupoo veellullipaaya
nuunamma boTTu
nuuTokka saari
puuTakokka tuuri
|
వీరగంధము
'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి చౌదరి
వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడో తెలుపండీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!
తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు
తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుదు
దూరమందున నున్న సహ్యజ
కత్తి నెత్తురు కడిగి నప్పుడు
ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్;
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్.
నదుముగట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్,
బాసయుచ్చిన తెలుగు బాలుడు
పా¬ఋఇపోవం డెన్నడున్.
ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట
తెలుగునాటిని వీరమాతను
జేసి మాత్రము తిరిగి రమ్మిక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు
వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!
|
veeragamdhamu
'kaviraaju ' tripuranaeni raamasvaami choudari
veeragamdhamu decchinaaramu
veeruDevvaDoa telupanDii!
puusi poadumu meDanu vaitumu
pooladamDalu bhaktitoa!!
telugu baavuTa kannu chedaraga
komDaveeTanu negirinappuDu
teluguvaarala kattidebbalu
gamDikoaTanu kaachinappuDu
teluguvaarala vaeDi netturu
tumgabhadranu galisinappudu
duuramamduna nunna sahyaja
katti netturu kaDigi nappuDu
iTTi samdiyamennaDaeniyu
buTTalaedu ravamtayun;
iTTi praSnala naDuguvaaralu
laekapoayiri sumtayun.
nadumugaTTina telugu baaluDu
venuka tirugamDennaDun,
baasayucchina telugu baaluDu
paa¬Ripoavam DennaDun.
idigoa! yunnadi veeragamdhamu
mai nalamdumu mainalamdumu;
Saamtiparvamu jaduvavacchunu
Saamti samarambaina pimmaTa
telugunaaTini veeramaatanu
jaesi maatramu tirigi rammika,
palutupaakulu palu Piramgulu
daari kaDDamu raakatappavu
veeragamdhamu decchinaaramu
veeruDevvaDo telpuDee!
poosipoadumu meDanu vaitumu
pooladamDalu bhaktitoa!!
|
వీదే నమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమ్మ
ఆవులు కాసే కృష్ణమ్మ వీదే ముద్దుల కృష్ణమ్మ
కాళ్ళగజ్జెలు చూడండి మెలలో గంటలు చూడండి
మెడలో దండలు చూదంది తలలో పించం చూడండి
చదువులనిచ్చే కృష్ణమ్మ సంపదలనిచ్చే కృష్ణమ్మ
పాపలకాచే కృష్ణమ్మ బాలబంధుడీ కృష్ణమ్మ
వీడేనమ్మ కృష్ణమ్మ వేణువు వూదే కృష్ణమ్మ
|
veedae namma kRshNamma vaeNuvu vuudae kRshNamma
aavulu kaasae kRshNamma veedae muddula kRshNamma
kaaLLagajjelu chuuDamDi melaloa gamTalu chuuDamDi
meDaloa damDalu chuudamdi talaloa pimcham chuuDamDi
chaduvulanicchae kRshNamma sampadalanicchae kRshNamma
paapalakaachae kRshNamma baalabamdhuDii kRshNamma
veeDaenamma kRshNamma vaeNuvu vuudae kRshNamma
|
వెనకా వెనకా వేములతోట
కనకా పండ్లు కాముని రూపులు
వాగూనీళ్ళు వనములు పత్రి
మెత్తని కాళ్ళు మేచక శంకలు
దూదీ మడుగులు దుప్పటిరేకులు
తెల్లని గూళ్ళో నల్లని వినాయక
నాలుగు చేతులు బారెదు తొండం
నమస్కారమయ్యా పార్వతీ తనయా!
|
venakaa venakaa vaemulatoaTa
kanakaa pamDlu kaamuni ruupulu
vaaguuniiLLu vanamulu patri
mettani kaaLLu maechaka Samkalu
duudii maDugulu duppaTiraekulu
tellani guuLLoa nallani vinaayaka
naalugu chaetulu baaredu tomDam
namaskaaramayyaa paarvatii tanayaa!
|
|
|
స హ
|
|
సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగబూసింది
చెట్టు కదలకుండా కొమ్మ వంచండి
కొమ్మ విరగకుండా పూలుగోయండి
అందులో పూలన్నీ దంద గుచ్చండి
దండ తీసుకెళ్ళి సీతకియ్యండి
దాచుకో సీతమ్మ రాముడంపేడు
దొడ్డి గుమ్మంలోన దొంగలున్నారు
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ
దాచుకోకుంటేను దోచుకుంటారు
|
siitamma vaakiTa sirimalle cheTTu
sirimalle cheTTaemo viragabuusimdi
cheTTu kadalakumDaa komma vamchamDi
komma viragakumDaa puulugoayamDi
amduloa puulannee damda gucchamDi
damDa teesukeLLi seetakiyyamDi
daachukoa siitamma raamuDampaeDu
doDDi gummamloana domgalunnaaru
daachukoa siitamma daachukoavamma
daachukoakumTaenu doachukumTaaru
|
|
|