అర్ధము :- ఒళ్ళంతా కళ్ళుంటాయి కాని ఇంద్రుడు కాడు. మెడ నల్లగా వుంటుంది కాని శివుడు కాడు. పాములను పట్టి చంపగలడు కాని పక్షిరాజు కాడు. ఇదేమిటి?
Meaning :- His body is full of eyes but he is not Indra, his throat is bluack but he is not Lord Shiva, he can catch and kill snakes but he is not the eagle king. Who is he?
సమధానం :- నెమలి
Answer :- Peacock
--------------------------------------------
పదములారు కలవు కాని బంభరంబా, కాదు;
తొండముండుగాని దోమకాదు;
ఱెక్కలుండుగాని పక్షిగానేరదు;
దీని భావమేమి తెలుసుకొనుడు.
అర్ధము :- ఆరుకాళ్ళున్నయికాని తుమ్మెద కాదు, తొండం వుంటుందికాని దోమ మాత్రము కాదు. రెక్కలుండుకాని పక్షికాదు. ఇదేమిటి?
Meaning :- It has six legs but it is no bee, it has a trunk but it is no mosquito, it has wings but it is no bird. What is it?
సమధానము :- ఈగ
Answer :- Fly
---------------------------------------------
సమస్య :-
కప్పను చూసి పాము గడగడ వణికింది
ఈ సమస్యను పూరించండి...
paamu (snake) shivered on seeing a kappa (frog)
Meaning : To guard the heaps, Ven'kappa' (name of a person) took his stick and wore his slippers and started and the snake shivered hearing the sound of the slippers and stick. Hence the snake shivered on seeing kappa.
----------------------------------------------
ఈ పద్యము విన్న తరువాత నాకు శ్రీకృష్న దేవరాయలు తెనాలి రామ కృష్ణుని అడిగిన వేరొక కథ గుర్తుకొచ్చినది...
సమస్య:-
బలరాముడు సీత జూచి పక్కున నగియన్
Meaning :- Balarama ( the brother of Krishna of dwaparayuga) laughed at Sita(Wife of Lord raama)
అష్టదిగ్గజాలకు క్లిష్టమైన ఈ పద్యాన్ని తెనాలి రాకృష్ణుదు ఇట్లు పూరించెను...
This presented a problem even to the 'Ashtadiggajas' (Eight wise men) was solved by Tenali Rama Krishna like this...
అర్ధము :- పాయసము త్రాగినంతనే పిల్లలు పుడతారా! అంద్ వాసుకి నవ్వంగా కాదు పొలములో దొరుకుతారని బలరాముడు సీతను జూచి పక్కుమని నవ్వాడంట.
రామాయణం తెలిసిన వారికి శ్రీ రమ జననం పాయసం త్రాగడం వల్ల జరిగిందని తెలుసు, అట్లానే సీతా దేవి జనక మహారాజుకి పొలం దున్నుతున్న వేళ జరుగిందని తెలియును.
Meaning :- Vasuki smiled saying 'Does drinking sweet milk give children' to which Balarama laughed at Sita saying no they are found in fields.
Here if you know the Epic Ramayana we will know that Lord Rama was born after his mother took the divine payasam (sweetened milk) and Sita, his wife was found when king Janaka was ploughing a field.
సమాధానము :-
ఇలలో నిద్దరు రాజులు
మలయుచు జదరంగ మాడిసూపటివేళన్
బల మెత్తి కట్ట మరచిన
నెలుకలు తమ కలుగులోని కేసుగునిడ్చిన్.
అర్ధము:- ఇద్దరు రాజులు పట్టుదలతో చదరంగ మాడుచుండగా, రాత్రికావడంచే చదరంగాన్ని ఎత్తికట్టకుండా వదలేయంగా, ఎలుకలు వచ్చి చదరంగంలోని ఏనుగును తమ కన్నాంలోకి ఈడ్చుకొని వెళ్ళినాయి.
Meaning :- When two kings were playing chess with interest into the night, so they left the chess board as it is, that is when rats dragged the elephants into their holes.
అర్ధము :- వండినది ఎండినదొకటి, కత్తిరించిన పచ్చిదొకటి, కాలినదొకటి, భోజనానికి రుచించేది. ఏమిటది?
Meaning :- One is cooked and dried, one is cut and fresh, one that is burnt, together they add taste to the meal. what is it?
సమాధానం :- ఆకు, వక్క, సున్నం వున్న ఖిళ్ళీ
Answer : leaf, nutmeg, and paste makes killi(pan)
అర్ధము :- శుద్ధ కులమునకు చెందిన ఒక సతి తన తండ్రిని చంపి పుడుతుంది, తిరిగి తాతను చేరి తండ్రికి జన్మనిస్తుంది. ఏవరది?
Meaning :- A pure birth lady is born after killing her own father and mingles with her grandfather to give birth to her father.
శమాధానము :-
మజ్జిగ - ఎలా అనగా మజ్జిగకు పెరుగు తండ్రి, పెరుగుకు పాలు తండ్రి. మజ్జిగ పెరుగునుంచి వస్తుంది అనగా తంద్రిని జంపి పుడుతుంది. పాలలో మజ్జిగ వేస్తే మరల పెరుగు వస్తుంది అనగా తాతను చేరి మరల తండ్రికి జన్మనిస్తుంది.
Answer:-
Buttermilk - buttermilk is from curd hence it is the father, similarly milk is the father of curd. So when buttermilk is formed by killing the father and by mingling with the milk(grandfather) it give birth o the father(curd) again.
అర్ధము :-
చెట్టుమీద ఉంటుంది కాని పక్షి కాదు. చర్మాన్ని ధరిస్తుంది కానీ సోమయాజి కాదు. మూడుకన్నులుంటాయి కానీ శివుడు కాదు. నీటిని ధరించి వుంటుంది కానీ మేఘంకాదు, కుండ కాదు. మరి అదేమిటి?
Meaning :-
It lives on the tree but it is not a bird. It wears skin but it is not a hunter. It has three eyes but it is not the Lord Shiva. It bears water but it is neither cloud nor pot. Then what is it?
సమాధానము :- కొబ్బరికాయ
Meaning :- Coconut
------------------------------------------------
కాళ్ళురెండు గలవు కాని మనిసికాడు
నోరుగల్గి యెదుటివారి నరచు
గాలిమేసి లెస్సగా నరుమోయును
దీని భావమేమి? తిరుమలేశ
అర్ధము :-
రెండు కాళ్ళు ఉన్నవి కానీ మనిషికాడు, నోరుగల్గి ఎదుట వాని పిలుచును, గాలిని భుజించి మనుషులను మోసుకొని పోవునది ఏమిటది తిరుమలేశా.
Meaning :-
It has two legs but not a man, it calls you and eats air and carries people. What is it?
సమాధానము :- సైకిలు
Answer :- Cycle
------------------------------------------------
మనుజుడేమికాదు మాటలాడగ నేర్చు
పాటగాడు కాదు పాటనేర్చు
కథలు పెక్కునుడువు కాదు జేజయ్యము
దీని భావమేమి తిరుమలేశ
అర్ధము :-
మనిషికాడు కానీ మాటలు నేర్చు, పాటగాడు కాదు కానీ పాటలు వచ్చు, కథలు అనేకము చెప్పును కానీ ఉపాధ్యాయుడుకాదు. మరి ఎవరో చుప్పు తిరుమలేశ
Meaning :-
Not a man but learned to talk, not a singer but can sing, not a teacher but tells us many tales, guess who it is tirumalesa.
సమాధానము :-రేడియో (ఆకాశ వాణి)
Answer:- Radio
--------------------------------------------------
దేహమెల్ల కళ్ళు దేవేంద్రుడాకాడు
బుజముపైనుండు బుడుతకాదు
తాను ప్రాణిగాదు తగిలి జీవులజంపు
దీని భావమేమి తిరుమలేశ!
అర్ధము :-
శరీరము అంతా కన్నులు వున్నయి కాని ఇంద్రుదు కాదు, బుజముపై వుంటాడు కానీ పిల్లవాడు కాదు, ప్రాణి కాదు కానీ జీవులను చంపుతున్నది ఏమిటది తిరుమలేశ
.
Meaning:-
Body full of eyes but not Indra, it hangs on your shoulders but not a child, not a living being but kills , what is it ?
సమాధానము :- వల
Answer :- Net
-------------------------------------------------
చలన శక్తిగలదు జంతువుగాదది
చేతులెప్పుడు త్రిప్పు శిశువుగాదు
కాళ్ళు లేవు సర్వ కాలంబు నడచును
దీని భావమేమి? తిరుమలేశ!
అర్ధము :-
కదిలే శక్తి గలిగినది కాని జంతువుకాదు, చేతులను తిప్పును కానీ సిశువు కాదు, కాళ్ళు లేవు కానీ అన్ని వేళళా నడచును. దీని భావము తెలుపుము తిరుమలేశ.
Meaning :-
It moves but it is not an animal, it circles its hands but it is not a baby, it has no legs but it runs. what is it?
సమాధానము:- గడియారము
Answer :- Clock
------------------------------------------------
మెరిసే గుండు - కళ్ళకు జోడు
తెల్లటి టోపీ - చెరగని వదనం
గుబురు మీసం - నున్నని గద్దం
బోసి నోరు - ముసిముసి నవ్వు
చేతిలో కర్ర - తెల్లని వస్త్రం
కాళ్ళకు జోడు - పరుగుల నడక
జాతికి నేత - ముద్దుల తాత
ఎవరో ఎవరో - చెప్పుకో చూద్ధాం!
Meaning :-
shiny head - spectacles
white cap - unfallable colour
bushy moustach - clean shaven chin
bare mouth - sweet smile
stick in hand - white drape
slippers to feet - a hurried pace
father of the nation - kind grandpa
who is it - could you tell!
అంచిత చతుర్థ జాతుదు
పంచమ మార్గమున నేగి ప్రథమ తనూజన్
గాంచి, తృతీయం బప్పరి
నించ్ ధ్వితీయంబు దాటి నృపుకడ కరిగెన్
అర్ధము :-
ఇందులో అర్థాన్ని పంచభూతాల సంఖ్యను బట్టి అన్వయంచుకొనవలెను.
పంచభూతములు: 1. పృధ్వీ - భూమి 2. ఆపః - నీరు 3. తేజ - అగ్ని 4. వాయు - గాలి 5. ఆకాశత - ఆకాశము
Panchabhutamulu : 1. పృధ్వీ - Earth 2. ఆపః - Water 3. తేజ - Fire 4. వాయు - Wind 5. ఆకాశత - Sky
చతుర్ధజాతుడు : నాలుగవదైన వాయువుకు పుట్టిన ఆంజనేయుడు
పంచమార్గం : అయిదవదైన ఆకాశమార్గాన వెళ్ళి
ప్రథమ తనూజన్ : మొదటిదైన ప్రుథ్వి - భూమి పుత్రిక సీతనుచూచి
తృతీయంబు : మూడవదైన అగ్ని (ఆలంకా పట్టణంలో ఉంచి కాల్చి)
ద్వితీయంబు :రెండవదైన నీతిని (సముద్రాన్ని) దాటి రాముని వద్దకు వచ్చాడు అని భావము
Meaning:-
The meaning to this poem lies in the knowledge of 'Panchabhutamulu'(The five elements of nature)
Panchabhutamulu : 1. pRdhvii - Earth 2. aapa@h - Water 3. taeja - Fire 4. vaayu - Air 5. aakaaSata - Sky
Chaturjaatudu : Born to the fourth element, anjaneya the son of wind
Pamchamaargamu : Through the fifth element of sky
Pratama Tanujan : The child of the first - Sita the daughter of Earth
Trutiyambu : The third element of agni (when hanuman burned down Lanka)
Dvitiyambu : Crossed the second element of water(When Anjaneya crossed the sea)
అర్ధము :-
సిరిగల వాడైన విష్ణుమూర్థికి పదహారువేల మంది తరుణులు చెల్లును. కానీ బిచ్చగాడికి ఇద్దరు భార్యలెందుకు? పరమేశ్వరా! నీకు పార్వతి చాలును కదైయ్యా, కాబట్టి గంగను మాకు విడవవయ్యా.
Meaning :-
One who is prosperous like Lord Vishnu could afford to have sixteen thousand wives, why does a poor person like you Lord shiva, need two wives, have Parvati and please leave Mother Ganga to us.
ఈ పద్యము శ్రీనాధుడు పలనాటిలో నీళ్ళకై తిరుగుతూ అవిదొరకకపోవడంతో చెప్పిన చాటు పద్యముగా చెప్పుకుంటారు.
This poem is by Srinatha, who was wandering in the region of PalanaaDu and recited this poem as he could not find water in that area.
చదువు మట్టు పడును; సంస్కృతి చెడిపోవు
సంపదలు తొలంగు; సౌఖ్యముడుగు;
గౌరవంబు వోవు ; గావున సోమరి
తనము కన్న హీన గుణము గలదే?
అర్ధము :-
చదువు చెడిపోవును, సంస్కృతి చెడిపోవును, సంపదలు తొలగిపోవును, సుఖము పోవును, గౌరవము పోవును, కావున సోమరితనము కన్న హీన గుణము లేదు.
Meaning :-
You will get back in studies, lose your culture, lose your property, happiness is lost, lose your honour, hence there is no sin greater than laziness.
భరత ఖండము చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారును గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి
అర్ధము :-
భారత దేశము ఒక పాడి ఆవు వంటిదైతే హిందువులు లేగదూడలు వంటివారు. కానీ తెల్లవారు గొల్లవారివలె దూడల నోరు కట్టివేసి వారే పాలు పితుకుచున్నారు.
Meaning :-
India is like a cow and all its people are the calves, the white people (the britishers) are closing the mouths of the calves and milking the cow for themselves.
రాజమంత్రి కాంగ్రేసు సభలో బిపిన్ చంద్రపాల్ ఉపన్యసించినప్పుడు చిలకమర్తి లక్ష్మీ నరసిమ్హ రావు గారు ఆశువుగా చెప్పిన పద్యమిది
When the congress minister Mr. Bipin Chandrapal visited, this poem was recited by Mr.Chilamarti Lakshmi Narasimharao.
రాజును రాజుగా డ్తడు రాహు ముఖంబున జిక్కె, వాహినీ
రాజును రాజు గాడతడు రామ శరాహతి దూలె, దేవతా
రాజును రాజుగా డతడు రావణనూ ఇకి నోడె నాజిలో;
రాజని రాజు మల్కి యిభరాముడె రాజు ధరాతలంబునని
అర్ధము:-
చంద్రుడు రాజు అన్నా రాజు కాడు అతడు రాహువు చేత మింగబడతాడు కాబట్టి. సముద్రుడు నదులన్నింటికీ రాజు అనబడుచున్నను, రాజు కాడు ఎందుకంటే రాముడు విల్లెక్కుపెట్టగానే వణికినాడు. ఇంద్రుడు రాజుకాడు ఎందుకంటే ఇంద్రజిత్తుచేతిలో ఓడిపోయాడు. రాజు అన్న మాటకు సరైన అర్హుడు రాముడే ఈ ధరాతలంబున.
Meaning:-
Moon is said to be the king of sky but it is not so because he is swallowed by Rahu. Sea is said to be king of rivers but it is not so because he shivered at the sight of Lord Rama arrow. Indra is not a king, as he was defeated by Ravana's son Indrajit. The only one who could bear the title king is Lord Ram himself.
- కందుకూరి రుద్రకవి ( ఖందుకురి ౠద్ర కవి)
అర్ధము :-
అక్షరంబు(చదువు) జీవులకు ఎంతో ముఖ్యమైనది. అక్షరము నాలుకకు తీయ్యని చెరకురసం వంటిది. చదువు మనను రక్షించును కాబట్టి అట్టి అక్షరాన్ని మనము రక్షించాలి.
Meaning :-
Alphabet (Study) is is quiet important. study is like sweet sugarcane juice to the tongue. study saves you from difficulties hence we should save our knowledge.
అర్ధము :-
శివుడు హిమాలయముపై శయనిస్తాడు, సూర్య చంద్రులు ఆఖాశంలో, విష్ణువు శేషము అనగా పాముపై శయనిస్తాడు వీరందరూ భూమిపై నుండకపోవుట నల్లుల భాధ భరించలేకపోవుట వల్లే.
Meaning :-
Lord Shiva sleeps on the Himalayas, Sun and moon in the sky, Lord Vishnu on the snake over the milky sea. All this to avoid the trouble of bed bugs.
అర్ధము :-
ఔచిత్యం తెలిసిన దాత వద్దకు అర్థులు తమంతట తామే వస్తారు. ఎవరూ పిలవ వలసిన పనిలేదు. పద్మాలు ఉన్న కొలనుకు తుమ్మెదలను ఎవరూ పిలవరు కదా!
Meaning :-
A wise man who gives with good will will be known and people come to him without asking just like the bees come to the pond filled with lotus flowers without invitation.