| ||||||||||
లోకస్వభావము | Human Nature | |||||||||
ఆరు నెలల సాహవాసముతో వాడేవీడౌను | After six months of friendship the nature of friends are exchanged. | |||||||||
పాముకి విషము తలనుండును - మనిషికి నిలువెల్లా విషమే | Snake has poison in her head - but a man has poison all over. | |||||||||
గాడిదకు గంధపు చెక్కల వాసన తెలియదు | A donkey cannot know the perfume of Sandalwood. | |||||||||
ఏ యండ కా గొడుగు పట్టవలెను | We should change the type umbrella with the weather. | |||||||||
వసుదేవు డంతటివాడు గాడిదకాళ్ళను పట్టుకొనెను | Even Vasudeva has to catch a donkey's leg. | |||||||||
బంగారు పళ్ళెమునకైనా గోడదాపు అవుసరము | Even a golden plate needs support. | |||||||||
ఎంతటి వారయినను లోకమునకు లొంగవలయును | No matter how strong you are, you are bound to society. | |||||||||
దుర్జనులు మంచివారితో కలహమును కోరుదురు | Bad people always fight with good people. | |||||||||
క్రొత్త ఒక వింత, పాత ఒక రోత | New is amazing, old is discouraging. | |||||||||
నిండు కుండ తొణకదు | A full pot never slips. | |||||||||
లేగలకు చేపనిదే ఆవులు పాలీయవు | Without the calf a cow never gives milk. | |||||||||
మంచివారికి మంచి, చెడ్డవారికి చెడు జరుగును | Good comes to those who are good and bad happens to those who are bad. | |||||||||
దేవుడు ఏమిచేసిననూ అది మనమేలు కొఱకే | God does everything for our own good. | |||||||||
ఎంత చెట్టున కంతే గాలి | The bigger the tree the more air it gives. | |||||||||
దేవుడిచిన బుధ్ధి దేవునివరకూ నుండును | The knowledge God gave us is for the God. | |||||||||
చిన్ననాటి అలవాట్లు చిరకాలముండును | Childhood habits stays with us forever. | *** | ||||||||
మన మంచి పనులే మనకు ధనము | The good that we do is our legacy. | *** | ||||||||
ఎవరు చేసిన పాపము వారిని వేటాడుచుండును | Those who do bad are haunted by it. | *** | ||||||||
దైవధ్యానమును మరువరాదు | Never forget to pray. | *** |