మన వారికి వంకాయ అంటే మక్కువ ఎక్కువ.
అలనాటి "గుత్తివంకాయి కూరోయ్ బావ...
కోరి వండినానోయ్ బావా..."
అనే తెలుగు పాటనుంచి నిన్న మొన్నటి
"ఆహా! ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నామరి మోజే తీరనిది
తాజా కూరలలో రాజా ఎవరంటే?
ఇంకా చెప్పాలా వంకాయేనండి"
అన్న సినిమా పాటలు తెలుగువారికి వంకాయ మీద వున్న ఇష్టాన్ని తెలుపుతాయి.
నిగనిగలాడే వంకాయతో అన్నో రకాల కూరలు వండవచ్చు.
గుత్తి వంకాయ కూర:
వంకాయ పేరు వినగానే ముందుగా మనకు గుర్తుకు వచ్చేది గుత్తి వంకాయ.
కావాలసినవి:
గుండ్రని వంకాయలు లేతవి 1కేజీ
శనగ పప్పు 50 గ్రాములు
మినప్పప్పు 50 గ్రాములు
ధనియాలు చారెడు
ఉప్పు తగినంత
నూనె 100 గ్రాములు
ఎండు మిరపకాయలు 15
తయారుచేయు విధము:
ముందుగా వంకాయలను పుచ్చులు లేకుండా చూచుకొని కాయను తొడిమ తీయకుండా,
కాయలు విడిపోకుండా, నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి.
కోసిన గుత్తులను నీళ్ళలోవేయండి.
గమనిక: కోసిన వంకాయలను ఎప్పుడుకాని నీతిలోవసి తరువాత వంటలో
ఉపయోగించాలి లేకపోతే వంకాయకు వున్న కనరెక్కే గుణం వల్ల కూర సరైన
రుచి రాదు.
బాండ్లీలో ముందుకొంచెం నూనె పోసి, ఎండు మిరపకాయలు, శనగ పప్పు,
మినపప్పు, ధనియాలు బాగా వేయించి, మెత్తగా పొడి కొట్టాలి. ఉప్పు
వేయటం మరువకూడదు. తరిగి ఉంచిన వంకాయలను నీరు లేకుండా వార్చి, నీరు
పోయేటట్లుగా గట్టిగా చేత్తో ఒత్తి ఒక పళ్ళెంలో పెట్టండి. కొట్టి
ఉంచిన కారం పొడిని వంకాయలలో కూరాలి. బాండ్లీలో మిగిలిన నూనె పోసి,
బాగా కాగాక, కూరిన వంకాయలను ఆ నూనెలో వేసి మూత పెట్టండి. సన్నని
మంటలో ఉడకనీయాలి. కూరని గరిటతో కలపకుండా, ఎత్తికుదపాలి.
బాగా మగ్గనిచ్చి దింపండి. వంకాయలు చికకుండా చూసుకోవాలి.
వడ్డించడం: గుత్తు వంకాయ వేడిగా ఉన్నప్పిడు ఎంతో రుచిగా
వుంటుంది. వడ్డించే ముందు కొత్తిమీర సన్నగా తరిగి కూరపై జల్లి వేడి
వేడి అన్నంతో వడ్డిస్తే బాగుంటుంది.
------------------------------------------
వంకాయ ఉల్లికారం :
కావాలసినవి:
వంకాయలు 1 కేజీ
ఉల్లిపాయలు రెండు (పెద్దవి)
ఉప్పు తగినంత
పచ్చికారం 100 గ్రా
నూనె చిన్న గిన్నెడు
తయారుచేయు విధము:
ముందుగా వంకాయలు గుత్తులుగా నీళ్ళలో తరిగి పెట్టుకోండి
తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర ఉప్పు
మెత్తగా ముద్దగా నూరుకోవాలి. తరిగిన వంకాలను నీరులేకుండా
పిండి అందులో ఈ ఉల్లి ముద్ద కూరుకోవాలి. బాండ్లీలో నూనె వేసి
బాగా కాగనిచ్చి, కూరిన వంకాయలను నూనెలో వేసి మగ్గనివ్వాలి.
పదినిమిషాలు ఉడికిన తరువాత మెల్లగా వంకాయ చిదప కుండా
తిప్పి మగ్గనివ్వాలి. కూర బాగా కలిశాక మూత పెట్టి,బాగా
ఉడకనీయాలి. ఉడుకుతున్నప్పుడే కమ్మని వాసనతో
ఘుమఘుమలాడుతూ, మీ ఆకలిని పెంచుతుంది.
మొదటి కూర కంటే ఈ కూరకు నూనె తక్కువ పడుతుంది.
------------------------------------------
వంకాయ అల్లంకూర :
కావాలసినవి:
వంకాయ 1 కేజీ
అల్లం చూపుడువేలంత
పచ్చిమిర్చి
కొత్తిమీర కట్ట
ఉప్పుతగినంత
నూనె
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు తగినంత వేసుకొని ముద్దగా
నూరుకోవాలి. వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి
నీటిలో వేసి ఉంచుకోవాలి.
బాండ్లీ లో నూనె వేసి తాలింపు దిన్సులు వేసి అవిచిటపట
అంటుండగా అల్లమ్ముద్ద అందులోవసి వేయించాలి. తరువాత
వంకాయ ముక్కలను బాండ్లీ లో వేసి మగ్గనివ్వాలి. ముక్కలు
మెత్త బడిన తరువాత కొద్దిగా నీరుపోసి మూత పెట్టి
మగ్గనివ్వాలి. అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుతూ వుండాలి.
ఈ కూర చాలా రుచికరంగా వుంటుంది.
------------------------------------------
వంకాయ వేపుడు :
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
వెల్లుల్లి
పచ్చికారం
ఉప్పు
నూనె
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా వంకాయలు తరిగి నీటిలో వుంచుకోవాలి.
తరువాత బాండ్లీ లో నూనె వేసుకొని తాలింపు దిన్సులు
వేసుకొని. ఉంటే కర్వేపాకు, వెల్లుల్లి వేసుకొని బాగ
వేయించాలి. నీటిలో వుంచిన వంకాయ ముకలను
బాండ్లీ లో వసుకొని అడుగంటకుందా కదుపుకోవాలి.
కొంచం మెత్తగా అయిన తరువాత తగినంత ఉప్పు, కారం,
పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. వేపుడు
అడుగంటనీయకుండా ఎప్పటికప్పుడు సన్న సెగన కదుపుతూ వుండాలి.
వేడి అన్న లోకి వంకాయ వేపుడు రసం మంచి జోడి
ఈ వేపుడుకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది.
------------------------------------------
వంకాయ శనగపప్పు కూర :
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
శనగ పప్పు గుప్పెడు
ఉల్లిపాయలు
ఉప్పు తగినంత
పచ్చికారం
పసుపు చిటికెడు
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా పచ్చి శనగ పప్పు నీటిలో నానేసి వుంచుకోవాలి
గంటతరువాత ఉడికించి నీటిని వార్చాలి. తరువాత వంకాయలు
సన్నగా తరిగి నీటిలో వుంచుకోవాలి. ఉల్లిపాయలను చీన్నగా
తరిగి ఉంచుకోవాలి.
బాండ్లీలో తగినంత నూనె వేసుకొని, నూనె మరిగిన తరువాత
తాలింపు దిన్సులు వేసి చిటపట లాడుతూ వుండగా ఉల్లిపాయలను
వేసి వేయించాలి. ఎర్రగా వేగిన ఉల్లిపాయలలో ఉడికించిన
శనగ పప్పు వేచాలి తరువత తరిగిన వంకాయ ముక్కలు అందులోవేసి
మూత పెట్టి మగ్గనీయాలి. పదినిమిషాల తరువాత తగినంత ఉప్పు,
కారం పసుపు వేసికొద్దిగా నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి.
ఏ కూర వేడి అన్నంలోకి గాని చెపాతీ లోకిగాని బాగుంటుంది.
------------------------------------------
వంకాయ ఉల్లిపాయ కూర :
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
ఉల్లిపాయలు
ఉప్పు తగినంత
పచ్చికారం
పసుపు చిటికెడు
వెల్లుల్లి రెప్పలు 4
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా వంకాయలు సన్నగా తరిగి నీటిలో వుంచుకోవాలి.
ఉల్లిపాయలను చీన్నగా తరిగి ఉంచుకోవాలి.
బాండ్లీలో తగినంత నూనె వేసుకొని, నూనె మరిగిన తరువాత
తాలింపు దిన్సులు వేసి చిటపట లాడుతూ వుండగా వెల్లుల్లి
రెప్పలు, ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఎర్రగా వేగిన
ఉల్లిపాయలలో తరిగిన వంకాయ ముక్కలు అందులోవేసి
మూత పెట్టి మగ్గనీయాలి. పదినిమిషాల తరువాత తగినంత ఉప్పు,
కారం పసుపు వేసికొద్దిగా నీరు వేసి మూత పెట్టి ఉడికించాలి
వద్దించే ముందుగా సన్నగా తరిగిన
------------------------------------------
వంకాయ పులుసు పెట్టి కూర
కావాలసినవి:
వంకాయలు 1 కేజీ
చింతపండు నిమ్మకాయ అంత
పసుపు చిటికెడు
పచ్చిమిరపకాయలు 10
ఎండు మిరపకాయలు 2
శనగ పప్పు
మినపప్పు
ఆవాలు
నూనె
ఉప్పు
కరివేపాకు
తయారుచేయు విధము:
ముందుగా వంకాయలు ముక్కలుగ తరిగి. కొంచెం నీరు పోసి ఉప్పు,
పసుపు, వేసి ఉడకబెట్టాలి. బాగా ఉడకనీయక ఒక్క ఉడుకు రానిచ్చి,
చిల్లుల పళ్ళెంలో వార్చి పెట్టుకోండి చింతపండు నీళ్ళలో
నాన పెట్టి, చిక్కటి రసం తీసి, వార్చిన ముక్కలపై పోసి
పెట్టండి. పచ్చి మిరపకాయలు సన్నగా తరిగి పెట్టండి.
బాండ్లీలో నూనె పోసి, ఎండు మిరప ముక్కలు, పోపు గింజలు
వేసి బాగా వేగినాక, పచ్చిమిరపకాయ ముక్కలూ, కరివేపాకు వేసి,
వేగాక ఉడికించి ఉంచిన వంకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టండి,
ఉడికిన కూర ను వేడిగా వడిస్తే అన్నంలోకి బాగుంటుంది.
ఈ కూర నోటికి ఎంతో హితవుగా ఉంటుంది.
------------------------------------------
వంకాయ శనగ పిండి:
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
శనగ పిండి
కారం
నూనె
ఉప్పు
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందు వంకాయలు ముక్కలు తరిగి, నూనె బాండ్లీలో వేసి, బాగా
కాగాక ఈ ముక్కలు వేసి, మూత పెట్టండి. పది నిమిషాల తర్వత,
ఉప్పు వేసి కలిపి తాలింపు పెట్టి, రెండు నిమిషాలు మగ్గనీయండి.
తర్వాత శనగపిండి,కూరలో చల్లి, కలిపి, మూత పెట్టి దించాలి.
------------------------------------------
వంకాయ శనగపిండి గుత్తి కూర::
కావాలసినవి:
వంకాయలు 1 కేజీ
శనగ పిండి
నూనె
కారం
ఉప్పు
తయారుచేయు విధము:
గుండ్రని వంకాయలను గుత్తులుగా తరిగి నీటిలో వుంచాలి.
శనగ పిండి కారమ, ఉప్పు కొంచెం నూనె వేసి కలిపి ఉంచుకోవాలి.
తదిపి ఉంచిన వంకాయ గుత్తులలో ఈ శనగ పిండి పొడిని కూరి
పెట్టుకోవాలి.
తరువాత బాండ్లీ లో రెండు గరిటలు నూనె వసుకొని వంకాయలను
ఒక్కొక్కటిగా అందులో వసుకొని మూత పెట్టి సన్న సెగన మగ్గనివాలి.
వంకాయలు చితికి పోకుండా జాగ్రత్త పడుతూ తిప్పుకోవాలి.
వంకాయలు పూత్తిగా ఉడికిన తరువాత
పొయ్యిమీదనుంచి దించుకొని సన్నగా తరిగిన కొత్తిమీర జల్లి
వడ్డిస్తే ఉట్టికూరే తినేయాలనంత రుచిగా వుంటుంది.
------------------------------------------
వంకాయ శనగపొడి గుత్తి కూర:
కావాలసినవి:
తెల్లని వంకాయలు 1 కేజీ
శనగ పప్పు
నూనె
ఎండు మిరపకాయలు 6
ఉల్లిపాయలు 4 పెద్దవి
వెల్లుల్లిపాయ రెప్పలు 5
కర్వేపాకు
ఉప్పు
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
గుండ్రని తెల్లవంకాయలను గుత్తులుగా తరిగి నీటిలో వుంచాలి.
బాండ్లీ లో ఎండుమిర్చి వేయించుకొని పెట్టుకోవాలి. తరువాత శనగ
పప్పు ఎర్రగా అయ్యెంత వరకు సన్న సెగన వేయించుకోవాలి. వేయించిన
శనగ పప్పు, ఎండు మిరపకాయలు ఉప్పు వెల్లుల్లి వేసి పొడి చేసుకోవాలి.
తరువాత బాండ్లీ లో నాలుగు గరిటలు నూనె వసుకొని వంకాయలను
ఒక్కొక్కటిగా అందులో వసుకొని వేయించాలి. వేయించిన వంకాయలను ఒక
పల్లెంలో తీసుకొని వేడిగా వున్నప్పుడే ఉప్పు చల్లాలి. వేరొక
బాండ్లీలో 1 గరిట నూనె వేసుకొని తాలింపుదిన్సులు వేసి అవి చిటపటలాడాక
సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు,కర్వేపాకు అందులో వేసి వేయించాలి.
ఉల్లిపాయలు వేగాక అందులో వేయించిన వంకాయ ముక్కలు వసి కలుపుకోవాలి.
తరువాత శనగపొడి జల్లుకొని బాగా కలిపి దించుకోవాలి.
------------------------------------------
వంకాయ పప్పు కూర:
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
పచ్చిమిరపకాయలు 5
పెసర పప్పు
పండు మిరపకాయలు 4
చింతపండు
ఉల్లిపాయ
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
పెసర పప్పు కడిగి కొద్దిగా నీరుపోసి ఉడకబెట్టాలి. వంకాలను పెద్ద
ముక్కలుగా తరిగి, ఉల్లిపాయ, పచ్చ్చిమిరపకాయ ముక్కలు కలిపి ఉడుకుతున్న
పప్పులో వేసి మూతపెట్టుకోవాలు. లేకపోతే ప్రెషెర్ కుక్కర్లో వేసి ఒక
విసిల్ రనివ్వండి. ఉడికిన పప్పులో చింతపండు రసం ,చిటెకెదు పసుపు,
కారం, ఉప్పు వేసి కలుపుకోవాలి.
బాండ్లీలో రెండు చంచాలి నూనె వసుకొని తాలింపుదిన్సులు, వెల్లుల్లి
రెప్పలు కర్వేపాకు వేసు తాలింపు లో పప్పు వేసి ఐదు నిమషాలు ఉంచాక
దింపుకోవాలి.
కందిపప్పుతోకూడా ఇదే విదంగా చేసుకోవచ్చు, కాకపోతే కందిపప్పు ముందుగా
బాగా ఉడకనిచ్చి తరువాత అందులో ముక్కలు వేసుకోవాలి.
------------------------------------------
వంకాయ పెద్దచిక్కుడు కలిపి కూర:
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
చిక్కుడుకాయలు బాగా గింజలున్నవి 1/4 కేజీ
పచ్చిమిరపకాయలు 4
ఎండు మిరపకాయలు 2
ఉప్పు తగినంత
నూనె
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా చిక్కుడుకాయలు పీచులేకుండా ముక్కలుగా తుంచు కోవాలి.
కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. వంకాయలు ముక్కలుగా తరిగి,
పొయ్యమీద బాండ్లీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని తాలింపు
దిన్సులు వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిరపకాయ ముక్కలువేసి,
బాగా వేగాక ముందు ఉడికించి ఉంచిన చిక్కుడు ముక్కలు వేయండి,
తర్వాత వంకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీరు చిలకరించి మూతపెట్టుకోవాలి.
ఈ కూర ముద్దకూరలా అవుతుంది. ఉడికిన చిక్కుడు గింజలు ఎంతో కమ్మగా
ఉంటాయి. ఈ కూర చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది.
------------------------------------------
వంకాయ పెద్దచిక్కుడు కలిపి కూర:
కావాలసినవి:
వంకాయలు 1/2 కేజీ
చిక్కుడుకాయలు బాగా గింజలున్నవి 1/4 కేజీ
పచ్చిమిరపకాయలు 4
ఎండు మిరపకాయలు 2
ఉప్పు తగినంత
నూనె
తాలింపు దిన్సులు:
మినపప్పు 1 చంచా
పచ్చి శనగ పప్పు 1/2 చంచా
ఆవాలు 1/4 చంచా
ఎండుమిర్చి 3
తయారుచేయు విధము:
ముందుగా చిక్కుడుకాయలు పీచులేకుండా ముక్కలుగా తుంచు కోవాలి.
కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. వంకాయలు ముక్కలుగా తరిగి,
పొయ్యమీద బాండ్లీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని తాలింపు
దిన్సులు వేసుకోవాలి. అవి వేగాక పచ్చిమిరపకాయ ముక్కలువేసి,
బాగా వేగాక ముందు ఉడికించి ఉంచిన చిక్కుడు ముక్కలు వేయండి,
తర్వాత వంకాయ ముక్కలు వేసి, కొద్దిగా నీరు చిలకరించి మూతపెట్టుకోవాలి.
ఈ కూర ముద్దకూరలా అవుతుంది. ఉడికిన చిక్కుడు గింజలు ఎంతో కమ్మగా
ఉంటాయి. ఈ కూర చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది.