దొండకాయ తో వంటలు

దొండకాయ గుత్తులు కూడా గుత్తులుగా తరిగి, వంకాయలకు పెట్టే ఉల్లికారం పెట్టి గుత్తులు వండుకోవచ్చు.

దొండకాయ పచ్చడి: 

కావాలసినవి: nothing దొండకాయలు - 1/4 కేజీ ఎండుమిర్చి - 5 గ్రా తాలింపు దిన్సులు - తగినన్ని పసుపు - చిటికెడు చింతపండు - ఉసిరికాయంత ఉప్పు - తగినంత నూనె - ఒక గెరిటడు


తయారుచేయు విధము: మందుగా బాండ్లీలో నూనె పోసి, ఎండుమిర్చి తాలింపు దిన్సులు బాగా వేయించి దించాలి. తరువాత, దొండకాయను రెండు ముక్కలుగా తరిగి, ముందు దొండకాయ ముక్కలు రోట్లో వేసి మెత్తగా దంచి ఒక గిన్నెలోకి తీసుకొండి తరువాత వేయించిన మిరపకాయలు, ఉప్పు, పసుపు, చింతపండు మెత్తగా నూరుకోవాలి. బాగా నూరాక, దంచి ఉంచిన దొండకాయ ముద్ద కూడా వేసి మెత్తగా నూరి, బాండ్లీలో కొంచెం నూనె వేసి, ఆవాలు, కొంచెం జీలకర్రవేసి, బాగా వేగాక తిరిగ మూత పెట్టి ఒక గంట ఉంచండి. త్ర్వాత ఈ పచ్చడి పుల్లగా బాగుంటుంది.
.
దొండకాయ శనగపిండి: 

కావాలసినవి: nothing దొండకాయలు - 1/4 కేజీ ఎండుమిర్చి - 5 గ్రా తాలింపు దిన్సులు - తగినన్ని పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత నూనె - ఒక గెరిటడు


తయారుచేయు విధము: దొండకాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి, ఉప్పు రాసి, బాగా పిండాలి. బాండ్లీలో నూనె వేసి, తాలింపు దిన్సులు, ఎండు మిరపకాయ ముక్కలూ వేసి వేగనిచ్చి, పిండి ఉంచిన దొండకాయ ముక్కలను తాలింపులో వేసి బాగా మగ్గనీయండి. మగ్గినాక, కొద్దిగా శనగపిండి చల్లి, ఓ పదినిమిషాలు, ఉంచి దింపండి. ఈ కూర కమ్మగా ఉంటుంది.

.
దొండకాయ అల్లం: 

కావాలసినవి: nothing దొండకాయలు - 1/4 కేజీ ఎండుమిర్చి - 5 గ్రాం అల్లం - 10 గ్రాం తాలింపు దిన్సులు - తగినన్ని పసుపు - చిటికెడు ఉప్పు - తగినంత నూనె - ఒక గెరిటడు


తయారుచేయు విధము: దొండకాయలను ముక్కలుగా తరిగి, బాండ్లీలో కొంచెం నూనె వేసి తాలింపు దిన్సులు ఎండుమిర్చి ముక్కలు వేసి దొండకాయ ముక్కలు అందులో వేసి కొంచం ఉడకలివ్వాలి తరువాత కొంచం అల్లం ముక్క ఆరు పచ్చిమిరపకాయముక్కలు, ఉప్పు, పసుపు, వేసి, మెత్తగా దంచి లేదా మిక్సీ లో మెత్తగా చేసి, ఆ ముద్ద ఉడుకుతున్న దొండకాయలలో వేసి కొంచం నీరు చిలకరించి మూత పెట్టలి. కూర బాగా ఉడికి, నీరు ఇంకిపోయాక క్రిందికి దించి, వేడి మీద తింటే బాగా రుచిగా ఉంటుంది.

.
: 

కావాలసినవి: nothing


తయారుచేయు విధము:

వడ్డించడం:
.