బీరకాయ తో వంటలు

బీరకాయ అనగానే చాలా అమంది ఒట్టి పత్యం కూర అని అంటారు. తేలికగా అరిగి వంటికి చలవ చేసేది బీరకాయ. కానీ ఆ బీరకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు.

బీరకాయ కూర: 

కావాలసినవి: nothing బీరకాయలు - 1 కేజీ తాలింపు దిన్సులు ఎండు మిర్చి -4 నూనె - గరిటదు ఉప్పు తగినంత


తయారుచేయు విధము: ముందుగా బీరకాయలను పొట్టు తీసి, సన్నగా ముక్కలు తరుగుకోవాలి. ఈ ముక్కలకి ఉప్పు రాసి, గట్టిగా పిసికి కాసేపు ఒక ప్రక్క పెట్టాలి. బాండ్లీలో నూనె వేసి తాలింపు దిన్సులు వేసి, ఎండు మిరపకాయలు ముక్కలౌగా తుంచి వేసి బాగా వేగాక ఉప్పు రాసి ఉంచిన బీరకాయ ముక్కలను గట్టిగా పిండి తాలింపు లో వేయాలి. మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి, ఈ కూర ఊరికే మగ్గిపోతుంది.

వడ్డించడం: ఇది సాదారణంగా లంఖణాలు చేసి లేచిన వారికి పెడితే త్వరగా అరుగుతుంది.
------------------------------------------
బీరకాయ కారం : 

కావాలసినవి: nothing బీరకాయలు - 1 కేజీ తాలింపు దిన్సులు ఎండు మిర్చి -4 నూనె - గరిటదు ఉప్పు తగినంత


తయారుచేయు విధము: ముందుగా బీరకాయలను పొట్టు తీసి, సన్నగా ముక్కలు తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి తాలింపు దిన్సులు వేసి, ఎండు మిరపకాయలు ముక్కలుగా తుంచి వేసి బాగా వేగాక బీరకాయ ముక్కలను తాలింపులో వేయాలి. మూత పెట్టి బాగా మగ్గాక ఉప్పుకారం తగినంత వేసి అయిదు నిమిషాలు వుంచి తీసివేయాలి.

------------------------------------------
బీరకాయ శనగపిండి కూర: 

కావాలసినవి: nothing బీరకాయలు - 1 కేజీ తాలింపు దిన్సులు శనగపిండి ఎండు మిర్చి -4 నూనె - గరిటదు ఉప్పు తగినంత


తయారుచేయు విధము: ముందుగా బీరకాయలను పొట్టు తీసి, సన్నగా ముక్కలు తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి తాలింపు దిన్సులు వేసి, ఎండు మిరపకాయలు ముక్కలుగా తుంచి వేసి బాగా వేగాక బీరకాయ ముక్కలను తాలింపులో వేయాలి. మూత పెట్టి బాగా మగ్గాక ఉప్పుకారం తగినంత వేసి అయిదు నిమిషాలు వుంచి దింపేటపుడు శనగపిండి జల్లి రెండు నిమిషాల తరువాత తీసివేయాలి.

వడ్డించడం: ఈ కూర అన్నంలోకి చాల బాగుంటుంది.
------------------------------------------
బీరకాయ తెలగపిండి కూర: 

కావాలసినవి: nothing బీరకాయలు - 1 కేజీ తాలింపు దిన్సులు తెలగపిండి ఎండు మిర్చి -4 నూనె - గరిటదు ఉప్పు తగినంత


తయారుచేయు విధము: ముందుగా బీరకాయలను పొట్టు తీసి, సన్నగా ముక్కలు తరుగుకోవాలి. బాండ్లీలో నూనె వేసి తాలింపు దిన్సులు వేసి, ఎండు మిరపకాయలు ముక్కలుగా తుంచి వేసి బాగా వేగాక బీరకాయ ముక్కలను తాలింపులో వేయాలి. మూత పెట్టి బాగా మగ్గాక ఉప్పుకారం తగినంత వేసి అయిదు నిమిషాలు వుంచి దింపేటపుడు తెలగపిండి జల్లి రెండు నిమిషాల తరువాత తీసివేయాలి.

వడ్డించడం: ఈ కూర అన్నంలోకి చాల బాగుంటుంది.
------------------------------------------
బీరకాయ పులుసు కూర: 

కావాలసినవి: nothing బీరకాయలు 1/2 కేజీ చింతపండు ఉసిరికాయంత ఉప్పు తగినంతా పసుపు చిటికెడు ఎండుమిర్చి - 4 పచ్చిమిర్చి - 2 తాలింపు దిన్సులు కర్వేపాకు ఒక రెప్ప


తయారుచేయు విధము: ముందు బీరకాయ పెచ్చుతీసి చక్రాలుగా తరిగి ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టి వార్చాలి. తరువాత బాండ్లీలో నూనె వేసి, కాగాక, తాలింపు దిన్సులు, ఎండుమిర్చి ముక్కలూ వేసి వేగాక, పచ్చి మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి చిటపటలాడాక, ఉడికించి వార్చిన బీరకాయ ముక్కలు అందులో వేసి, చింతపండు చిక్కగా రసం తీసి, కూరలో పోసి కలిపి మూత పెట్టండి ముక్కలకి బాగా రసం పట్టి ఉడికాక, దింపండి

వడ్డించడం: ఈ కూర వేడి మీద అన్నంలో కలుపుకుంటే చాల బాగుంటుంది.
------------------------------------------
బీరకాయ పప్పు: 

కావాలసినవి: nothing పెసరపప్పు - పావు కేజీ బీరకాయలు - 1 కేజీ చింతపండు - చిన్న నిమ్మకాయంత పసుపు - టీ స్పూన్ కారం - ఒక చంచా ఉప్పు - తగినంత తాలింపు దిన్సులు - తగినంత పచ్చిమిరపకాయలు - 4 ఎండుమిర్చి - 2


తయారుచేయు విధము: ముందుగా బీరకాయలు పెచ్చుతీసి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి, పచ్చి మిరపముక్కలు, పెసరపప్పు, బీరకాయముక్కలు కలిపి, కుక్కరులో వేసి ఉడికించాలి. బాగా ఉడికాక ఉప్పు, కారం పసుపు, చింతపండు రసం చిక్కగా చేసి పోసి మూతపెట్టాలి. బాండ్లీ లో తాలింపు దిన్సులు ఎండుమిర్చి ముక్కలు వేసి అవి వేగాక ఉడికిన పప్పు అందులో పోసి (ఉంటే కొంచం ఇంగువ ఒక స్పూను నీటిలో కలిపి పప్పులో వసి బాగా కదిపి) మూతపెట్టాలి.

వడ్డించడం: ఈ పప్పులోకి చల్ల మిరపకాయలు(మజ్జిగ మిరపకాయలు) కానీ, మినప వడియాలు గాని వేయించుకొంటే చాలా బాగుంటుంది.
------------------------------------------
బీరకాయ పొట్టు పచ్చడి: 

బీరకాయ వండినప్పుడల్లా పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు. బీరపొట్టు, ఎండ పెట్టి, కందిపప్పుతో కలిపి కూరవండుకోవచ్చు. బీరకాయతో ఏదీ వూరికే పోదు ముందు పొట్టు పచ్చడి చెబుతాను కావాలసినవి: nothing బీరపొట్టు సుమారు ఒక కిలో కాయలకి వచ్చిన పొట్టుకి చెబుతాను. బీర పొట్టు ఎండుమిర్చి - 10 తాలింపు దిన్సులు - తగినన్ని చింతపండు - ఉసిరికాయంత ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు నూనె - చిన్న నేతిగిన్నెడు


తయారుచేయు విధము: ముందుగా బీరపొట్టు బాగా కడిగి పెట్టుకోండి. బాండ్లీలో నూనె పోసి, ఎండుమిరపకాయలు, పోపు సామాను, ఉప్పు, చిన్న ఇంగువ ముక్క కలిపి బాగా వేయించి పొడిచేసుకోవాలి. తరువాత బాండ్లీలో మరికొంత బీరపొట్టు వేసి, చింతపండు ముద్ద పెట్టి కొంచం నీరు చిలకరించి మూత పెట్టండి. నీరు ఇగిరి, పొట్టుబాగా మగ్గి మెత్తగా అయినాక దింపి, చల్లరనిచ్చి, మెత్తగా పచ్చడి నూరండి, ఈ పచ్చడి చాలా
------------------------------------------
బీరకాయ పొట్టు కందిపప్పు: 

కావాలసినవి: nothing బీరపొట్టు సుమారు ఒక కిలో కాయలకి వచ్చిన పొట్టుకి చెబుతాను. బీర పొట్టు కందిపప్పు గుప్పెడు ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు నూనె - చిన్న నేతిగిన్నెడు


తయారుచేయు విధము: బీరపొట్టుతో చారెడు కందిపప్పు వేసి బద్దలుగా ఉడికించాలి. కొంచెం సేపు ఉడికాక కొద్దిగా ఉప్పు వేయిండి అప్పుడు ఉప్పు, పొట్టుకీ పడుతుంది. ఉడికించిన కంది పప్పు, బీరపొట్టును వార్చి పక్కన పెట్టుకోవాలి. బాండ్లీలో నూనె పోసి తాలింపుదిన్సులు ఎండు మిరపకాయ ముక్కలను వేసి అవి వేగాక పచ్చిమిరపకాయ ముక్కలను వేసి, ఉడికించిన కందిపప్పు, పొట్టు బాండ్లీలో వేసి కలిపి మూత పెట్టండి. ఈ కూర పది నిమిషాల తరువాత దింపితే బాగా మగ్గి, పొడిపొడిగా ఉంటుంది.

వడ్డించడం: అన్నం కలిపి తింటే ఎంతో రుచి, బలము కూడా.
------------------------------------------