ఈ వ్రతం చేసే రోజున స్త్రీలు ఉదయమే మంగళస్నానం చేసి, కొత్త బట్టలు
కట్టుకొని, పూజగదిలో కానీ, మరో అనువైన చోటన కానీమంటపం కట్టి దాని మధ్యన
ముగ్గులతో తీర్చిదిద్ది కొబ్బరికాయకు లక్ష్మీరూపం అలంకరించి కలశస్థాపన
చేసి వరలక్ష్మీ వ్రతమైతే లక్ష్మీ దేవినీ, మంగళగౌరీ వ్రతమైతే మంగళగౌరినీ
ఆవాహనం చేసి, షోడశోపచారాలతో పూజిస్తారు.
పూజానంతరం పసుపు పూసిన తోరం చేతికి కట్టుకొని, సాయంకాలం ఆరతి ఎత్తి,
పేరంటంచేస్తారు. తరువాత వరలక్ష్మీ వ్రత కథా మంగళగౌరీ వ్రతకథా చదువుతారు.
ఆ కాలంలో దొరికే ఫలాలతో అలంకరించడం, నైవేద్యానికి ఆవిరి కుడుములు వంటి
తేలికైన తినుబండారాలను సిద్ధ పర్చడం, అన్నింటినీ ఐదైదుగా పెట్టడం ఆచారం.
వరలక్ష్మీ కటాక్షం, మంగళగౌరీ కటాక్షం ఏస్త్రీలపై వుంటుందో వారికి వైధవ్య
బాధ వుండదు. వారు సర్వసౌభాగ్యాలతో తులతూగుతారు.
పూజ సామగ్రి : పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, తమలపాకులు, అగరవత్తులు, వక్కలు, కర్పూరం,
వత్తులు, గండం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశం, కలశవస్త్రం, అమ్మ వారి ప్రతిమ
లేక విగ్రహం.
పంచామృతం - అనగా ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార
దీపములు - తైలం, నెయ్యి
వస్త్రం - ప్రతితో చేయవచ్చు లేకపోతే పట్టు చీర రవిక (జాకెట్టు గుడ్డ)
అమ్మవారికి పెట్టిన తరువాత కట్టుకోవచ్చు.
మాంగల్యం - పసుపు తాడు దానికి అమ్మవారి ప్రతిమ లేక పసుపు కొమ్ము కత్తుకోవచ్చు
ఆభరణములు - అమ్మవారికి వేసిన తరువాత వెసుకోవచ్చు
పూజ విధానము
పసుపు ముద్దాతో వినాయకుని తయారుచేసుకొని ఒక పీట మిద బియ్యం పరిచి కలశంలో
కొత్తబియ్యం, గుళ్ళు, మాముడి ఆకులు కొబ్బరికాయ వుంచి దానిని పీట మద్యలో
ఉంచి పూజకు సిద్ధం చేసి సంకల్పం చేసుకోవలెను.
తోరము - పసుపుదారంతో ఒక్కొక్క పువ్వు పెట్టి తొమ్మిది ముడులు వేసిన తోరములు మూడు చేసుకోవలెను.
ఒకటి అమ్మవారికి, ఒకటి చేయువారికి, ఒకటి పెద్ద ముత్తయిదువుకి
|